అల్లర్లకు ముఖ్యమంత్రే కారణమా ?

మణిపూర్లో అల్లర్లు, దాడులు, దహనాలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగే కారణమని ఎంపీల బృందం తల్చేసింది. మణిపూర్లో పరిస్ధితులను అధ్యయనం చేయటంతో పాటు అల్లర్లకు కారణాలను తెలుసుకునేందుకు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు రెండు రోజులు మణిపూర్లో పర్యటిస్తున్నారు.

Update: 2023-07-30 06:18 GMT

మణిపూర్లో అల్లర్లు, దాడులు, దహనాలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగే కారణమని ఎంపీల బృందం తల్చేసింది. మణిపూర్లో పరిస్ధితులను అధ్యయనం చేయటంతో పాటు అల్లర్లకు కారణాలను తెలుసుకునేందుకు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు రెండు రోజులు మణిపూర్లో పర్యటిస్తున్నారు. తమ పర్యటనలో ఒకవైపు కుకీలను మరోవైపు మొయితీ తెగల జనాలతో ఎంపీల బృంధం భేటీఅయ్యింది. ఈ సందర్భంగా రెండు తెగలనుండి కూడా ముఖ్యమంత్క్రి బీరేన్ సింగ్ పై తీవ్ర అసంతృప్తిని గమనించింది.

బాధితులు, రెండు తెగల ముఖ్యనేతల ఆరోపణలు, అసంతృప్తుని చూసిన తర్వాత మణిపూర్ ప్రస్తుత పరిస్ధితికి ముఖ్యమంత్రే కారణమన్న విషయాన్ని ఎంపీల బృందం నిర్ణయానికి వచ్చింది. అందుకనే తమ పర్యటనలో బీరేన్ సింగ్ ను కలవకూడదని నిర్ణయించింది. అయితే గవర్నర్ ను మాత్రం కలిసి పరిస్ధితులను వివరించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవాలని అనుకున్నది. అందుకనే గవర్నర్ అపాయిట్మెంట్ ను కోరింది. మరి గవర్నర్ ఏమిచేస్తారో చూడాలి.

తమ పర్యటనలో భాగంగా ఎంపీలు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందమేమో చురచందాపూర్, మరో బృందం మణిపూర్లోని ఈస్ట్ ఇంఫాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో పర్యటించింది. తర్వాత రాత్రికి ఒకచోటుకి చేరుకున్న రెండు బృందాల్లోని ఎంపీలు తమ అబ్సర్వేషన్లను, తాము తెలుసుకున్న వివరాలను షేర్ చేసుకున్నారు. మొత్తానికి ఇండియాకూటమి ఎంపీల పర్యటనకు కేంద్రప్రభుత్వం అనుమతించదనే అందరు మొదట్లో అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తు ఎంపీల బృందం పర్యటించేందుకు అంగీకరించింది.

దీనికి కారణం ఏమిటంటే భయమనే అనిపిస్తోంది. మణిపూర్లో పర్యటించేందుకు ఇతరులను ఎవరినీ కేంద్రం అనుమతించటంలేదు. దాంతో రాష్ట్రంలో ఏమి జరుగుతోందో బయటప్రపంచానికి వాస్తవాలు తెలీటంలేదు. గతంలో రాహుల్ గాంధి పర్యటనను కూడా కేంద్రం అడ్డుకున్న విషయం తెలిసిందే. రెండున్నర నెలలుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు రావణకాష్టంలాగ అట్టుడికిపోతున్నా నరేంద్రమోడీ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కర్ఫ్యూ విధించినా అల్లర్లు మాత్రం ఆగటంలేదు. దీంతోనే అల్లర్లవెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆ కుట్ర ఏమిటనే విషయం మాత్రం బయటపడలేదు.

Tags:    

Similar News