మార్చి 31న బ్యాంకులు పని చేయాల్సిందే!

రంజాన్ పండుగ కావటంతో వచ్చే సోమవారం చాలా రాష్ట్రాల్లో సెలవు రోజును ప్రకటించారు.;

Update: 2025-03-27 04:43 GMT
Rbi Mandate bank operations in march31st

క్యాలెండర్ ఇయర్ (జనవరి 1 నుంచి డిసెంబరు 31).. విద్యా సంవత్సరం (జూన్ తో మొదలై ఏప్రిల్ లేదంటే మేతో ముగుస్తుంది) .. అదే విధంగా ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మొదలై తర్వాతి ఏడాది మార్చి 31తో ముగుస్తుంది) ఇలా పలు అంశాలకు వేర్వేరు తేదీలను ఏడాదిగా పరిగణించటం తెలిసిందే. మరో మూడు రోజుల తర్వాత రానున్న మార్చి 31.. గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి రోజు. ఈ రోజున అన్ని బ్యాంకులు పని చేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.

రంజాన్ పండుగ కావటంతో వచ్చే సోమవారం చాలా రాష్ట్రాల్లో సెలవు రోజును ప్రకటించారు. అయినా ప్రభుత్వ లావాదేవీలను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఆ రోజున బ్యాంకులు పని చేయాలని నిర్ణయిం తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న (ఈసారి సోమవారం వచ్చింది) ప్రభుత్వ ఆదాయాలు.. ఇతర లెక్కల్ని వివరంగా పేర్కొనాల్సి ఉంటుంది.

వీటి నమోదు తప్పనిసరి. దీంతో.. ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని బ్యాంకులు మార్చి 31న సాధారణ పని గంటల్లో పని చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆన్ లైన్.. మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో వార్షిక ఖాతా ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఇదిలా ఉండగా బుధవారం దేశ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ ఫాం అయిన గూగుల్ పే.. ఫోన్ పే సేవల్లో అంతరాయంపై యూనిఫెడ్ పేమెంట్స్ (యూపీఐ) స్పందించింది. స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ.. ‘అరుదుగా తలెత్తే సాంకేతిక లోపాలతోనే ఇలా జరిగింది’ అని మాత్రం పేర్కొంది. డిజిటల్ పేమెంట్లకు బాగా అలవాటు పడిన ప్రజలకు మాత్రం బుధవారం సాయంత్రం మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News