అక్కడంతే... పెళ్లి వయసు వస్తో ఇంటింటికీ వెళ్లి బెగ్గింగ్ చేయాలి!
ఈ క్రమంలో దసరా నుండి శరద్ పూర్ణిమ వరకు.. పెళ్లీడుకి వచ్చిన అబ్బాయిల గుంపులుగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి బెగ్గింగ్ చేస్తారు.
పెళ్లి అంటే రకరకాల సంప్రదాయాలు తెరపైకి వస్తుంటాయి. మన దేశంలో అయితే వివాహాలకు సంబంధించి అనేక చిత్ర విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి. వాటిలో బాగా పాపులర్ అయినవి, ఎక్కువగా తెలిసినవి నాలుగో ఐదో ఉంటే... బయట ప్రపంచానికి పెద్దగా తెలియనివి వందల సంఖ్యలో ఉండొచ్చని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆచారం ప్రకారం పెళ్లి వయసు వస్తే ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేయాలి!
అవును... సాధారణంగా అబ్బాయిలు, అమ్మాయిలకు పెళ్లి గడియలు దగ్గరపడ్డాయంటే ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుండటం తెలిసిందే. ఇక అనంతరం ఆ పెళ్ళిని ఎవరి స్థోమతకు తగ్గట్లుగా వారు అత్యంత గ్రాండ్ గా చేసుకుంటారు. తమ జీవితంలో వివాహ వేడుక గుర్తుండి పోయేలా ఉండాలనుకుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఒక భిన్నమైన ఆచారం ఉంది. అక్కడ పెళ్లి జరగాలంటే ఇంటింటికీ వెళ్లి బెగ్గింగ్ చేయాలి.
వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఒక గ్రామంలో విచిత్రమైన పెళ్లి వేడుక తాజాగా వార్తలలో నిలిచింది. స్థానిక చంబల్ ప్రాంతంలో ఎక్కువగా జరుపుకునే తేసు పూర్ణిమ పండుగ అనేది ఇలాంటి కార్యక్రమానికి నాంది అని అంటున్నారు. దీని ప్రకారం... దీపావళికి ముందు, చంబల్ ప్రాంతంలో తేసు పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఇది నవమి నుండి ప్రారంభమవుతుంది. అనంతరం... శరద్ పూర్ణిమ నాడు గొప్ప వైభవంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలో దసరా నుండి శరద్ పూర్ణిమ వరకు.. పెళ్లీడుకి వచ్చిన అబ్బాయిల గుంపులుగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి బెగ్గింగ్ చేస్తారు. ఇదే సమయంలో అమ్మాయిలు కూడా గుంపులు గుంపులుగా గంటలు పట్టుకుని, పాటలు పాడుతూ, భిక్షాటన చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాస్తవంగా ఇక్కడ నుంచే పెళ్లిళ్లు ప్రారంభమవుతాయని అంటారు.
అయితే వారు చెబుతున్న పురాణ కథల ప్రకారం... తేసు, సంఝీ మొదట వివాహం చేసుకుంటారట.. దీని తర్వాత సహలాగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ శరద్ పూర్ణిమ పండుగ ప్రారంభానికి సంబంధించి ఇక్కడ చాలా పురాణగాథలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... కుంతి అవివాహితగా ఉండగా, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరిలో మొదటివాడు బబ్బరవాహనుడు. అయితే ఇతడ్నికి కుంతి చిన్నప్పుడే అడవిలో విడిచిపెట్టిందట. ఈ క్రమంలో ఇతడు చాలా తెలివైన వాడని.. మిగిలిన వారితో పోలిస్తే అసాధారణమైన పెరుగుదల కలవాడట. ఫలితంగా... సాధారణ పిల్లల కంటే రెట్టింపు వేగంతో పెరగడం ప్రారంభించాడట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత, అతను ఉపద్రవం సృష్టించడం ప్రారంభించాడట.
దీంతో... పాండవులు అతనితో చాలా కలత చెందడం ప్రారంభించారట. ఫలితంగా సుభద్ర కోరికపై, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతని మెడను కత్తిరించాడని చెబుతున్నారు. అయితే బబ్బరవాహనుడు అమరుడు కావడంతో... అప్పుడు కృష్ణుడు తన దివ్యదృష్టితో విషయం గ్రహించి ద్వారా సంఝీని సృష్టించాడు. ఆమెను తేసుతో వివాహం చేయించి, ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఆదేశిస్తాడట. ఫలితంగా... ఈ ఆచారం వచ్చిందని చెబుతారు.
తేసు యొక్క ప్రధాన నిర్మాణం మూడు కర్రలను కలుపుతూ చేసిన స్టాండ్ కాగా.. దానిపైన మధ్యలో దీపం ఉంచుతారు. తేసు తల మాత్రమే తయారు చేసే గ్రామాల్లో పసుపు పచ్చి మట్టి, సున్నం, కాటుక పూస్తారట. ఈ పురాణ కథ అక్కడ ప్రాచుర్యంలో ఉండటంతో అనాదీగా ఇక్కడ బెగ్గింగ్ చేసివచ్చిన డబ్బులను పెళ్లి వేడుకలో ఉపయోగిస్తారంట.