మహిళల కంటే త్వరగా చనిపోయేది మగాళ్లే... తాజా అధ్యయనం!
ఇందులో భాగంగా కొడుకు, భర్త, తండ్రి లాంటి బాధ్యతల నడుమ బ్రతుకుతున్న మగాడి జీవిత కాలం వేగంగా క్షీణిస్తోందని తేలిందని తెలిసింది.
స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఆయుర్దాయం తగ్గుతుందని, ఇందుకు చాలా కారణాలున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మహిళల జీవిత కాలం ఆధారంగా జరిపిన ఈ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం తెలిసింది. ఇందులో భాగంగా కొడుకు, భర్త, తండ్రి లాంటి బాధ్యతల నడుమ బ్రతుకుతున్న మగాడి జీవిత కాలం వేగంగా క్షీణిస్తోందని తేలిందని తెలిసింది.
అవును... 2021 యూఎస్ డేటా ప్రకారం మహిళల ఆయుర్ధాయం 79.1 సంవత్సరాలు కాగా.. పురుషుల ఆయుర్ధాయం 73.2 గా ఉంది. ఇప్పుడు తాజాగా భారత మహిళల ఆయుర్దాయం 70.4 ఏళ్లు ఉండగా.. పురుషులకు 67.8 ఏళ్లుగా ఉందని అధ్యయనం చెబుతుంది. దీంతో... పురుషుల ఆయుర్దాయం పెంచేందుకు, మహిళల దీర్ఘాయువుకు గల కారణాలను తెలుసుకొనేందుకు లోతైన పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఈ అధ్యయనంపై స్పందించిన పరిశోధకులు... స్త్రీల దీర్ఘాయువు వెనుకున్న కారణాలు పూర్తిగా తెలియలేదని చెబుతూనే... పురుషుల ఆయుర్దాయం తగ్గడానికి గల కారణాలు ఇవే అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా... టెస్టోస్టిరాన్ స్థాయిలు పురుషుల వ్యాది నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయనేది కూడా ఒక కారణం అని అంటున్నారు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.
మరోవైపు స్త్రీలలోని ఈస్ట్రొజన్ హర్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక ప్రమాదల నుంచి వారిని కాపాడుతుందట. ఇదే సమయంలో... పురుషులు బలమైన వారనే భావన సుమారు అన్ని సంస్కృతుల్లోనూ బలంగా ఉండటంతో.. వారు అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తుండడం దీనికి గల మరో కారణంగా చెబుతున్నారు. అలా అని వయసుతో సంబంధం లేకుండా మగవారే ఎక్కువగా మృతి చెందుతున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... డయాబెటిస్ కారణాలతో మరణించే ప్రమాదం స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇదే సమయంలో కోవిడ్ సమయంలో కూడా పురుషులు ఎక్కువగా మరణించారని అంటున్నారు. ప్రతి 1,00,000 మంది కరోనా వైరస్ పేషెంట్లలో 140 మంది పురుషులు మరణించగా, స్త్రీలు 87.7 మంది కోవిడ్ కారణంగా మరణించారని చెబుతున్నారు. అంతేకాదు క్యాన్సర్ వల్ల సంభవించే మరణాలు కూడా పురుషుల్లోనే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఇలా రకరకాల ఫిజియోలాజికల్, సైకలాజికల్, సోషల్ కారణాలతో దీర్ఘాయుష్షు విషయంలో పురుషులు స్త్రీల కంటే వెనుకబడి ఉన్నారని కొత్త అధ్యయనం చెబుతోంది. కనుక పురుషులు ఇక నుంచైనా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తుచేస్తుందని చెబుతున్నారు.