రెజ్యూమెలో పో*ర్న్ స్టార్ పేరు... పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూ కాల్స్... కారణం ఇదే!

అయితే... దీనికి పూర్తి భిన్నంగా ఓ వ్యక్తి తన రెజ్యుమెను ప్రిపేర్ చేశాడు.

Update: 2024-10-01 02:30 GMT

సాధారణంగా ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించేవారు యాజమాన్యాన్ని మెప్పించేలా తమ రెజ్యుమెను రూపొందించుకుంటుంటారనేది తెలిసిన విషయమే. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లక్షణాలు తమకు ఉన్నాయని.. పుస్తకాలు చదవడమే తమకు హాబీ అని.. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుందని వాటిలో పొందుపరుస్తుంటారు!

అయితే... దీనికి పూర్తి భిన్నంగా ఓ వ్యక్తి తన రెజ్యుమెను ప్రిపేర్ చేశాడు. ఇందులో పోర్న్ స్టార్ మియాఖలీఫా పేరు పొందుపరిచాడు. ఇదే సమయంలో తన మద్యం అలవాటును, అందులో సృష్టించిన రికార్డులను కూడా పేర్కొన్నాడు. దీనివల్ల తనకు ఓ కీలక విషయం తెలిసిందని చెబుతున్నాడు. ఇప్పుడు ఆ రెజ్యూమె వైరల్ గా మారింది.

అవును... న్యూయార్క్ కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి జెర్రీ లీ తాజాగా ఓ రెజ్యూమే ప్రిమేర్ చేశాడు. తాను ఇప్పటికే గూగుల్ కంపెనీలో స్ట్రాటజీ, ఆపరేషన్స్ మేనేజర్ గా మూడేళ్లు పనిచేయడం వల్ల రెజ్యూమె లో గూగుల్ పేరు ప్రస్థావిస్తే ఎలాంటి ఉద్యోగావకాశాలు వస్తాయో పరిశీలించాలని భావించాడు.

అక్కడితో ఆగని జెర్రీ లీ... తన రెజ్యూమె లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తో పాటు పోర్న్ స్టార్ మియాఖలీఫా పేరును ప్రస్థావించాడు. ఇదే సమయంలో తాను ఒక్క రాత్రిలో తాగిన ఒడ్కా షాట్స్ తో రికార్డ్ సృష్టించినట్లు తెలిపాడు. అనంతరం తన రెజ్యూమె ను ఫార్వర్డ్ చేశాడు. అయితే లీకి అనూహ్యం రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో భాగంగా ఆరు వారాల వ్యవధిలో సుమారు 29 కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయంట. దీంతో... ఆశ్చర్యపోయిన జెర్రీ... ఈ ప్రయోగం ద్వారా తాను ఓ కీలక విషయం నేర్చుకున్నట్లు చెబుతూ... ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా... ప్రముఖ సంస్థల్లో పని చేసిన ఉద్యోగులకు ఇతర కంపెనీలలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని.. దాని కోసం సీవీలను ఆకర్షణీయంగా రూపొందిస్తే సరిపోతుందని తెలిపాడు. ఎందుకంటే... రిక్రూటర్లు మనలో ఉన్న వర్కింగ్ స్కిల్స్ ని మాత్రమే చూస్తారు తప్ప మన అలవాట్ల గురించి పట్టించుకోరని స్పష్టం చేశాడు.

Tags:    

Similar News