పవన్ కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన వైసీపీ మంత్రి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని పట్టుకుని ఈ స్థాయి ఎంత నీ బతుకు ఎంత, నీవెంత అంటూ మంగళగిరి లో జరిగిన పార్టీ మీటింగులో జనసేనాని ఒక రేంజిలో రెచ్చిపోయి మాట్లాడారు.

Update: 2023-09-17 10:38 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని పట్టుకుని ఈ స్థాయి ఎంత నీ బతుకు ఎంత, నీవెంత అంటూ మంగళగిరి లో జరిగిన పార్టీ మీటింగులో జనసేనాని ఒక రేంజిలో రెచ్చిపోయి మాట్లాడారు. దానికి వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి జోగి రమేష్ నుంచి అంతే స్థాయిలో కౌంటర్ వచ్చి పడింది. అది కూడా స్ట్రాంగ్ డోస్ గా ఉంది.

నీవు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటావో, ఆయన సంక నాకుతావో నీ ఇష్టం. సమయం సందర్భం లేకుండా ముఖ్యమంత్రి జగన్ మీద దారుణమైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

జగన్ అంటే ఏమనుకుంటున్నావ్ ఆయన స్థాయి గురించి నీకు తెలియదేమో అయిదు కోట్ల మంది ఆరాధ్య నాయకుడు అని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. 2011లో కడప పార్లమెంట్ కి ఉప ఎన్నిక జరిగితే దెశమంతా చూసేలా అయిదు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన వీరుడు జగన్ అన్నారు. 2014లో విపక్షంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని గుర్తు చేశారు.

ఇక 2019 నాటికి 151 సీట్లతో దేశమంతా చర్చించుకునేలా అద్భుతమైన మెజారిటీతో ఏపీ సీఎం అయిన వారు జగన్ అన్నారు. అలంటి జగన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించామని జోగి రమేష్ స్పష్టం చేశారు. జగన్ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతీ ఇంటి ముంగిటకు పంపిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

జగన్ ని అది చేస్తాం, ఇది చేస్తామని అన్న వారు అంతా ఏమైపోయారో పవన్ తెలుసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని టీడీపీ నుంచి సీట్లు తెచ్చుకుని పోటీ చేయ్, అది నీ ఇష్టం, కానీ జగన్ వంటి రాజకీయ యోధుడి గురించి ఒక్క మాట అనే హక్కు పవన్ కి లేదని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి పెడితే అందులో యువరాజ్యం ప్రెసిడెంట్ గా ఉన్న పవన్ కాంగ్రెస్ ని తమ పార్టీని అమ్ముకున్నారని అన్నారు. కొన్నాళ్ల తరువాత జనసేన పెట్టి 2014లో ఒక్క సీటూ పోటీ చేయకుండా బాబుకు హోల్ సేల్ గా పార్టీని అమ్మేశారని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ అవినీతిపరులు అని తిట్టిన పవన్ కి ఇపుడు చంద్రబాబు ఎందుకు అంతలా నచ్చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒక విలువ, సిద్ధాంతాలు లేని వ్యక్తి పని అన్నారు. అవి కనుక ఉంటే జైలులోకి ములాఖత్ పేరిట వెళ్ళి మిలాఖత్ అవడం పవన్ చేయడని సెటైర్లు వేశారు. తన హీరో సీఎం అవుతాడని జనసైనికులు జెండా పట్టుకుని తిరుగుతున్నారని, వారందరినీ మోసం చేసి టీడీపీ జెండాను పవన్ పట్టుకున్నారని జోగి రమేష్ విమర్శించారు. ఇప్పటికైనా జనసైనికులు పవన్ ఆలోచనలు తెలుసుకోవాలని సూచించారు.

పవన్ కళ్యాణ్ జగన్ మానసిక స్థితి గురించి మాట్లాడం పెద్ద జోక్ అన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎవడైనా పిచ్చోడు ఉన్నాడూ అంటే అది పవన్ మాత్రమే అన్నారు. పవన్ కి ఎంత పిచ్చి ఉందో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెబుతారని అన్నారు. ఒక పార్టీ కాదు, ఒకరితో పొత్తులు కాదు అందరితో అన్ని వేళలలో పొత్తులు పెట్టుకుని మళ్లీ వారి నుంచి దూరంగా జరుగుతూ వస్తున్న పవన్ కి మానసికంగా స్థిరత్వం ఎంత ఉందో అందరికీ తెలుసు అని జోగి రమేష్ అన్నారు. పవన్ మరోసారి జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News