ఎంపీలుగా వెళ్ళనున్న మంత్రులు వీరేనా...!?

వైసీపీలో జంబ్లింగ్ విధానం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలను ఎంపీలుగా అలాగే ఎంపీలను ఎమ్మెల్యేలుగా చేసి వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబెట్టాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2023-12-17 03:00 GMT

వైసీపీలో జంబ్లింగ్ విధానం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలను ఎంపీలుగా అలాగే ఎంపీలను ఎమ్మెల్యేలుగా చేసి వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబెట్టాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో చూస్తే ముగ్గురు మంత్రులు ఎంపీలుగా వెళ్లే చాన్స్ కచ్చితంగా కనిపిస్తోంది. అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో మొత్తం ఆరుగురు మంత్రులు ఉన్నారు. ఉమ్మడి విశాఖ నుంచి గుడివాడ అమరనాధ్, బూడి ముత్యాలనాయుడు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదరి అప్పలరాజు ఉన్నారు.

వీరిలో చూసుకుంటే విశాఖ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులకు మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి చాన్స్ ఉంది అని అంటున్నారు. విజయనగరం జిల్లా చూసుకుంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని తెలుస్తోంది. చాలా కాలంగా ఈ వార్త వినిపిస్తున్నా కూడా ఇపుడు మాత్రం కచ్చితమే అని అంటున్నారు.

ఎందుకంటే సీనియర్లు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఎమ్మెల్యే సీటు మీద కూడా ఉంటుందని ఆ విధంగా పార్టీ గెలుస్తుందని వైసీపీ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు. ఇక మరో మంత్రి పీడిక రాజన్నదొర సాలూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరులో కొత్త ముఖాలకు చాన్స్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. దాంతో రాజన్నదొరను అరకు ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన సైతం వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీ సీటు అయినా తనకు ఓకే అన్నట్లుగా ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది.

ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుని ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఈ సీటు విషయంలో వైసీపీ పట్టుదలగా ఉంది. ఈసారి వారూ వీరూ కాకుండా రాజకీయ దిగ్గజం మంత్రి అయిన ధర్మానను పోటీలోకి దించితే మంచి ఫలితం ఉంటుందని అదే విధంగా శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లు మొత్తం గెలుస్తామని వైసీపీ లెక్క వేసుకుంటోంది.

టోటల్ గా చూసుకుంటే మాత్రం ముగ్గురు మంత్రులు ఎంపీలుగా వచ్చే ఎన్నికల్లో కనిపించవచ్చు అని అంటున్నారు. మరి వీరి ప్లేస్ లలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్ధులు అవుతారు అన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. బొత్స లోక్ సభకు పోటీ చేస్తే ఆయన తనయుడు సందీప్ కి చీపురుపల్లి టికెట్ కావాలని కోరుతారు అని అంటున్నారు.

అదే విధంగా ధర్మాన ప్రసాదరావు సైతం తమ కుమారుడు రాం మనోహర్ నాయుడుకు శ్రీకాకుళం సీటు కోరుతున్నారు. పీడిక రాజన్నదొరకు అలాంటి వారసత్వ డిమాండ్లు లేకపోయిన తన మనిషి అన్న వారి పేరునే ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధికి సూచిస్తారు అని అంటున్నారు. అయితే సాలూరు నుంచి పోటీకి జీసీసీ చైర్ పర్సన్ స్వాతి పేరు కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News