లిక్కర్ స్కాం ....ఆదికి ముందే ఇలా !
దాంతో నిజాల నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది.;

ఏపీలో లిక్కర్ స్కాం వ్యవహారం రాజకీయాన్ని ఒక కుదుపు కుదుపుతోంది. వైసీపీ హయాంలో అతి పెద్ద లిక్కర్ స్కాం జరిగింది అన్నది నాటి విపక్షాల అభియోగం. ఇపుడు అవే అధికార కూటమిగా ఉన్నాయి. దాంతో నిజాల నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపధ్యంలో వైసీపీకి చెందిన బిగ్ షాట్స్ పేర్లు ఇందులో ఉన్నాయని ప్రచారం సాగింది. అయితే తనకు ఇందులో సంబంధం లేదని రాజంపేట మిథున్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఆయన తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టుకు వెళ్ళారు. ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది.
ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అంతే కాదు ఈ కేసు విషయంలో ఎటువంటి తొందరపాటు చర్యలకు దిగవద్దని తెలిపింది. తనను మద్యం కేసులో అరెస్ట్ చేయవద్దంటూ ఎంపీ మిధున్ రెడ్డి వేసీన్ పిటిషన్ మీద జరిగిన విచారణలో హైకోర్టు ఈ తీర్పు ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అయితే దీనిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని గతంలోనే న్యాయస్థానానికి తెలిపారు దాంతో బుధవారం ఈ కేసుని విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో తరువాత విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
అయితే దీని మీద టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. టీడీపీ లీగల్ టీం ఇంత వీక్ గా ఉందా అని వారు అందులో ప్రశ్నిస్తున్నారు. ఏపీలో లిక్కర్ స్కాం వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున సాగింది అన్నది అందరికీ తెలుసు అని వారు అంటున్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉందో కూడా కధనాలు వస్తున్నాయని అలాంటిది ఈ కేసులో ఆదికి ముందే ఇలా అయితే ఎలా అన్న చర్చ సాగుతోంది.
లిక్కర్ స్కాం విషయంలో కూటమి పెద్దలు పట్టుదలగా ఉన్నారని అంటున్నారని మరో వైపు చూస్తే పరిణామాలు వేరుగా ఉంటున్నాయని వారు అంటున్నారు. ఈ విషయంలో గట్టిగా వ్యవహరించాల్సి ఉందని పార్టీ వాదులకు పార్టీ లీగల్ టీం కి సూచిస్తున్నారు.
మొత్తానికి చూస్తే ఏపీ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ వస్తుందా సీబీఐ రంగంలోకి దిగుతుందా అన్న చర్చలు హీటెక్కించేలా సాగుతున్న వేళ వైసీపీ ఎంపీకి ముందస్తు బెయిల్ దక్కడం ఆ పార్టీ వైపు నుంచి చూస్తే భారీ ఊరట అంటున్నారు. అదే సమయంలో ఈ కేసులో ప్రకంపనలు పుట్టిస్తామని కూటమి వైపు నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒకింత నిరాశగా ఉన్నాయని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు.