మహిళపై అత్యా*చార ఆరోపణలు.. ఎమ్మెల్యే కేసులో కీలక పరిణామాలు!

ఒక మహిళపై అత్యా*చార ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-12 08:11 GMT

ఒక మహిళపై అత్యా*చార ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2019లో సత్యవేడు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలంకు 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ టికెట్‌ ఇచ్చారు. అయితే దీనికి అంగీకరించని ఆయన టీడీపీలో చేరి సీటు దక్కించుకున్నారు. అంతేకాకుండా కూటమి హవాలో విజయం సాధించారు.

ఈ క్రమంలో తెలుగు మహిళ నేత ఒకరు కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన తనను బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోనేటిని పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్‌ చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు సమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహిళ ఆరోపణల నేపథ్యంలో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోనేటి ఆదిమూలం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ను దాఖలు చేశారు. తాను నిరపరాధినని, ఆమే తనను డబ్బుల కోసం బెదిరిస్తోందని ఆరోపించారు. పోలీసులు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేయాలని కోరారు. విచారణ జరపకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు.

హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై నుంచి పుత్తూరులోని తన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను తప్ప ఎవరినీ లోనికి పంపలేదు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు ఆదిమూలం మొగ్గుచూపడం లేదు.

కాగా తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా రెండు రోజులపాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని తెలుస్తోంది. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. తిరుపతి ఈస్ట్‌ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి బీమా ప్యారడైజ్‌ హోటల్లోని 105, 109 రూములను పోలీసులు పరిశీలించారు. హోటల్‌ సీసీ టీవీ పుటేజీని సేకరించారు. అలాగే ఆ మహిళ విడుదల చేసిన అశ్లీల వీడియో నిజమైందో కాదో తెలుసుకోవడానికి దాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోఉ్ట వచ్చాక ఎమ్మెల్యేను ప్రశ్నించనున్నారు. ఈ మేరకు స్పీకర్‌ అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News