పవన్ కు అండగా మోడీ
గతంలో పవన్ ఈ శాఖలను మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఆర్థిక సాయం కేంద్రం చేసింది.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జనసేనాని ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తోంది అనడానికి ఇదొక తాజా ఉదాహరణ. పవన్ చేతిలో ఉన్న పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలలో నిధుల కొరత లేకుండా కేంద్రం చూసుకుంటోంది.
గతంలో పవన్ ఈ శాఖలను మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఆర్థిక సాయం కేంద్రం చేసింది. ఇపుడు చూస్తే మరోసారి భారీగా నిధులను విడుదల చేయడం ద్వారా పవన్ కి అండగా ఉంటామని పించుకుంది. పదిహేనవ ఆర్ధిక సంఘం కింద తొలి విడతగా ఏపీలోని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కోసం 983 కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులతో తొమ్మిది జిల్లా పరిషత్తులలో అలాగే 600 పైగా మండలాలో 13 వేల పై చిలుకు ఉన్న గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఉంటుంది.
గ్రామాలలో మండలాలలో కచ్చా రోడ్లతో పాటు రహదారులు నిర్మించడం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు. నిజానికి చూస్తే గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం పంచాయతీరాజ్ శాఖకు నిధులు విడుదల చేసినా వాటిని వేరే కార్యక్రమాలకు డైవర్ట్ చేశారు అన్న విమర్శలు వినిపించాయి. గ్రామ సర్పంచులు అయితే తమకు రూపాయి కూడా అందలేదని కనీసం వీధి దీపాలను కూడా వెలిగించలేని దుస్థితిలో ఉన్నామని బావురుమన్నారు. వైసీపీ సర్పంచులు కూడా అలాగే ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు.
అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఈ శాఖలను ప్రత్యేక దృష్టితో తీసుకోవడం ఆయన గ్రామ సీమల మీదనే ఫోకస్ పెట్టడంతో పాటు జాతీయ ఉపాధ్ హామీ పథకం కింద ఎక్కువ పని దినాలు వచ్చేట్లుగా చూడడం జరిగింది. ఈ విషయంలోనూ పవన్ అభ్యర్ధననకు కేంద్రం సహకరించి ఏపీకి ఎక్కువ ఉపాధి పని దినాలు కేటాయించింది.
దాంతో గతంలో ఏపీ మొత్తంగా ఒకేసారి 13 వేల పై చిలుకు గ్రామ సభలను నిర్వహించి వరల్డ్ రికార్డుని కూడా పంచాయతీ రాజ్ శాఖ సాధించింది. ఇపుడు చూస్తే ఆ ఉపాధి పధకం కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నెల 14 నుంచి పల్లె పండుగ పేరుగో మరో భారీ ప్రోగ్రాం కి పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాల్లో ఉండగా కేంద్రం నిధులు విడుదల చేయడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు.
ఇక ఈ శాఖలను చూస్తున్న పవన్ కి కూడా కీర్తి పెరుగుతుందని పల్లె సీమల్లో రాజకీయం కూడా జనసేనకు అనుకూలం అవుతుందని అంటున్నారు అలా జరగాలనే పవన్ అండగా ఉండేందుకే సరైన సమయంలో కేంద్రం నిధులు విడుదల చేసిందని చెబుతున్నారు. ఇక మలి విడత నిధులు కూడా తొందరగానే రానున్నాయని చెబుతున్నారు.
మరో వైపు చూస్తే టీడీపీ కూటమికి కూడా ఇది మేలు చేసే నిర్ణయమే అని అంటున్నారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాంలు జరిగితే చంద్రబాబు కూడా వాటిని చూపించి తమ ప్రభుత్వం ఘనత అని చెప్పుకుంటారని అంటున్నారు. అలా గ్రామ సీమలలలో అభివృద్ధి జరిగితే కూటమికే ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేంద్రం ఏ ఉద్దేశ్యంతో నిధులు విడుదల చేసినా టోటల్ గా కూటమికి పల్లెలలో మరింత ఆదరణ పెరిగేలా చేస్తుందని అంటున్నారు దాంతో కూటమి నేతలు ఖుషీగా ఉన్నారు.