రాహుల్ వైపు చూడొద్దు.. పట్టించుకోవద్దు: మోడీ పాఠాలు
``ఆయన విపక్ష నేత అని వారు(ఇండియా కూటమి) చెబుతున్నారు. కానీ, వారికి ఎలా ఉన్నా.. రాహుల్‌కు మాత్రం జ్ఞానం లేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా యువ ఎంపీలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి.. కొన్నికీలక పాఠాలు బోధించారు. కొత్తగా దేశవ్యాప్తంగా 120 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. వీరంతా కూడా.. తొలిసారి.. పార్లమెంటులోకి అడుగు పెడుతున్న వారే.. వీరిలో 80-85 మంది వరకు ఎన్డీయే కూటమి పార్టీల సభ్యులే ఉన్నారు. దీంతో వీరిని ఉద్దేశించి.. తాజాగా మోడీ ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు విధివిధానాలను వదిలేసి..విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి చెప్పడం గమనార్హం.
``ఆయన విపక్ష నేత అని వారు(ఇండియా కూటమి) చెబుతున్నారు. కానీ, వారికి ఎలా ఉన్నా.. రాహుల్‌కు మాత్రం జ్ఞానం లేదు. పార్లమెంటులో ఎలా మాట్లాడాలో తెలియదు. నోటికి శుద్ధిలేదు..బుద్ధికి బుద్ధిలేదు. ఆయన వైపు చూడకండి.. ఆయనను అనుసరించకండి. అసలు ఆయనను పార్లమెంటులో పట్టించుకో కండి. మీకైనా కావాలంటే.. పార్లమెంటు విధివిదానాలు , ఎలా మాట్లాడాలో తెలియాలంటే.. మన వాళ్లలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారిని ఫాలో అవండి. అవసరమైతే.. నా దగ్గరకు రండి`` అని మోడీ పాఠాలు చెప్పారు.
పార్లమెంటుకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఆ సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడాలని మోడీ యువ ఎంపీల కు, కొత్తగా వచ్చిన వారికి సూచించారు. నియమ నిబంధనల విషయంలో సందేహాలను సీనియర్లను అడి గి నివృత్తి చేసుకోవాలన్నారు. ఏ విషయంలోనూ రాహుల్‌ను అనుసరించవద్దని కూడా ఆయన సూచించారు. సోమవారం నాటి లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై మోడీ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను ఉద్దేశించి యువ ఎంపీలకు ఇలా క్లాస్ ఇవ్వడం గమనార్హం.
రాహుల్ గాంధీ.. సభను, సభాపతిని ప్రతిపక్ష నేత అవమానించారన్నది ఎన్డీయే పార్టీల అభిప్రాయం. ఇదే మోడీ కూడా చెబుతున్నారు. తాము అధికారంలోకి రాలేదని.. మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని రాహుల్ రగిలిపోతున్నారన్నది కూడా.. మోడీ ఆవేదన. మొత్తానికి తాజాగా అయితే.. ఆయన పార్లమెంటులో రాహుల్ వ్యవహారంపై ఇలా కొత్త నేతలకు.. పాఠాలు నేర్పించడం మాత్రం కొత్త సంప్రదాయమనే అంటున్నారు పరిశీలకులు.