ఏపీకి మోడీ దూరం.. జాబితా నుంచి ఔట్!
అయితే.. పైకి అభివృద్ది కార్యక్రమాలే అయినా.. ఆయన ఎక్కడకు వెళ్లినా బీజేపీని గెలిపించాలనే కోరుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ వైపు చూడడం లేదా? ఎన్నికల ప్రచారం నుంచి ఏపీని డిలీట్ చేశారా? అంటే.. ఔననే అంటు న్నాయి ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోడీ.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే.. పైకి అభివృద్ది కార్యక్రమాలే అయినా.. ఆయన ఎక్కడకు వెళ్లినా బీజేపీని గెలిపించాలనే కోరుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెలలో షెడ్యూల్ వచ్చే లోగా దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అంతేకాదు.. ఈ రాష్ట్రాల్లో కూడా.. ఒకటికి రెండు సార్లు ఆయన పర్యటించనున్నారు. ఇదే తెలంగాణలోనూ జరిగింది. తెలంగా ణలో రెండు రోజుల్లో రెండు సార్లు వచ్చారు. ప్రసంగాలు దంచి కొట్టారు. ఇక, తమిళనాడు, కేరళ, ఒడిశా సహా.. పలు రాష్ట్రాల్లో కూడా రెండేసి సార్లు పర్యటనలు పెట్టుకున్నారు. ఎన్నికలముందు.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని ప్రజల నాడిని ప్రధాని అంచనా వేసుకుంటున్నారు. అయితే.. ఈ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని తెలిసింది. ఇదే విషయం పరోక్షంగా ప్రధాని కార్యాలయం కూడా స్పష్టత ఇచ్చింది. పీఎంవో విడుదల చేసిన సమాచారంలో ఏపీ మినహా 22 రాష్ట్రాలు ఉన్నాయి.
అంటే.. ప్రధాన మంత్రి ఏపీపై దృష్టి పెట్టడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రీ షెడ్యూల్ ముందుకు కావడంతో భిన్న వాదనలు తెరమీదికి వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన తర్వాత.. ఆయన వచ్చేందుకు అవకాశం ఉందని కొంరదు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కేంద్రం చేపట్టే కార్యక్రమాలు ఏమీ లేనందునే ప్రధాని రావడం లేదని ఈ వర్గం చెబుతోంది.
అయితే.. అసలు ప్రధాని ఏపీపై దృష్టి పెట్టాలని భావించడం లేదని.. మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన ఏపీ విషయంలో తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉందని అంటున్నారు.
రేపు.. టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. అప్పుడు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ప్రధాని రాష్ట్రాల పర్యటనలో మాత్రం ఏపీ లేదు. వాస్తవానికి ఏపీలో బీజేపీ పుంజుకోవాలని.. ఇక్కడ నిలదొక్కుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీఎం జగన్‌కు అనుకూలంగా కొందరు బీజేపీలో ఉన్నారని, వారు.. ఇక్కడ ఆయనకు పరోక్షంగా సహకరిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే మోడీ వంటి బలమైన నాయకులు తటస్థ వైఖరితో వ్యవహరిస్తు న్నారనేది వీరి వాదనగా ఉంది. అయితే.. ఎన్నికల షెడ్యూల్ నాటికిఏపీలో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని ఎలాంటి నిర్నయం తీసుకుంటారో చూడాలి.