ఎన్నిక‌ల వేళ‌.. తేజ‌స్ యుద్ధ విమానంలో మోడీ చ‌క్క‌ర్లు!

ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న మోడీ తెలంగాణ‌కు వ‌చ్చే ముందు క‌ర్ణాటక రాజ‌ధాని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను సందర్శించారు.

Update: 2023-11-25 13:54 GMT

ఒక‌వైపు రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు.. తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తేజ‌స్ యుద్ధ విమానంలో ప్ర‌త్య‌క్ష మ‌య్యారు. పైల‌ట్ దుస్తులు ధ‌రించి..త‌ల‌కు హెల్మెట్ పెట్టుకుని.. ఆయ‌న తేజ‌స్‌లో చ‌క్క‌ర్లు కొట్టారు. వాస్త‌వానికి ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా యుద్ధ విమానంలో ప్ర‌యాణం చేయ‌డం ఆశ్చ‌ర్య క‌రంగా మారింది.


ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న మోడీ తెలంగాణ‌కు వ‌చ్చే ముందు క‌ర్ణాటక రాజ‌ధాని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను సందర్శించారు. ఈ క్ర‌మంలో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో డీఆర్ డీవో, భార‌త వైమానిక ద‌ళం, హాల్ సంయుక్తంగా రూపొందించిన తేజ‌స్ యుద్ధ విమానాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం.. ఆయ‌న పైల‌ట్ దుస్తులు ధ‌రించి.. ఏకంగా తేజ‌స్ విమానంలో ప్ర‌యాణించి.. గాలిలో చ‌క్క‌ర్లు కొట్టారు.


అనంతరం సంస్థ తయారీ కేంద్రం వద్ద జరుగుతున్న పనుల్ని సమీక్షించారు. ఫైటర్ జెట్ల తయారీ గురించి అడిగి తెలుసుకున్నా రు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. తేజస్ లో ప్రయాణించడం సంతోషంగా ఉందంటూ తన ఎక్స్ అకౌంట్ లో సంబంధిత చిత్రాలు షేర్ చేశారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన యుద్ధ విమానాన్నిఉద్దేశిస్తూ నమ్మశక్యం కానిది సాధించి చూపించాం అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు.


Tags:    

Similar News