టీడీపీలోకి మోహన్ బాబు కుటుంబం ?
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మోహన్ బాబు కుటుంబం గురించి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది.
మంచు మోహన్ బాబు ఇటీవలనే తన యాభై ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఏడు పదులు వయసు దాటిన ఆయన ఇపుడు సినిమాలలో ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నారు. ఆయన సంతానం సినీ రంగంలో తమదైన తీరులో పనిచేస్తోంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మోహన్ బాబు కుటుంబం గురించి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది.
మోహనబాబు టోటల్ ఫ్యామిలీ అంతా తిరిగి సైకిలెక్కి బోతోంది అన్నది ఆ టాక్. మోహన్ బాబు మొదట టీడీపీకి చెందిన వారే. సినీ నటుడిగా ఉంటూ టీడీపీని అన్న ఎన్టీఆర్ అనౌన్స్ చేసినపుడు సినీ రంగం నుంచి మొదట మద్దతు పలికిన నటుడు మోహన్ బాబు అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే గుర్తుండే విషయం.
ఆయన పార్టీలో చాలా కాలం పాటు పనిచేసిన మీదట ఎన్టీఆర్ 1994లో సీఎం అయ్యాక రాజ్యసభకు పంపించారు. అయితే 1995 ఎపిసోడ్ లో మోహన్ బాబు చంద్రబాబు వైపు వచ్చారు. ఆ తరువాత బాబుతో ఆయన విభేదించి బీజేపీకి 1998 ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు. ఇక ఆ మీదట చాన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న ఆయన 2014లో మోడీని కలిసి మళ్లీ మద్దతు ప్రకటించారు.
ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. జగన్ కి మద్దతుగా నిలిచారు. అయితే వైసీపీలో ఆయనకు సముచిత స్థానం దక్కలేదని కలత చెందారు అని అంటారు. మొత్తానికి మోహన్ బాబు వైసీపీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక ఎన్నికల తరువాత ఆయన చంద్రబాబుతో బాగానే ఉంటున్నారు
ఇపుడు ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా బ్రదర్ అంటూ లోకేష్ ని సంభోధించడం ఆయనతో భేటీలు వేయడం అన్నీ చూసిన వారు తొందరలో అధికారికంగానే మోహన్ బాబు ఫ్యామిలీ తిరిగి టీడీపీలో చేరుతుందని అంటున్నారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైసీపీ వైపు కాంగ్రెస్ వైపు మోహన్ బాబు కొంత మొగ్గు చూపడానికి కారణం ఆ కుటుంబంతో ఉన్న బంధుత్వం. మంచు విష్ణు జగన్ కజిన్ సిస్టర్ ని వివాహం చేసుకున్నారు. ఆ విధంగా చూస్తే జగన్ కి మోహన్ బాబు మావయ్య వరస అవుతారు.
అదే టైం లో మోహన్ బాబుకు చంద్రబాబుతోనూ దగ్గర బంధుత్వం ఉంది అని అంటారు. ఇపుడు అయితే మోహన్ బాబు ఫ్యామిలీ టీడీపీ వైపే చూస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు మీద గతంలో విమర్శలు చేసిన మోహన్ బాబు చాలా కాలంగా ఆయన గురించి మంచిగానే మాట్లాడుతున్నారు. ఇక రాజకీయాల్లో చూస్తే ఇవన్నీ మామూలే అని అంటారు.
ఇంకో వైపు చూస్తే మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన దివంగత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తెని వివాహం చేసుకున్నారు. ఆ కుటుంబం అంతా టీడీపీలోనే ఉంది. దాంతో మోహన్ బాబు విష్ణు ఇపుడు టీడీపీ వైపు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీడీపీకి ఈ ఫ్యామిలి చేరువ అయింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మోహన్ బాబు కుటుంబం అనధికారికంగా టీడీపీనే ఉందని అంటున్నారు. మరి అధికారికంగా పార్టీలో చేరుతారా లేదా ఈ విధంగానే తమ మద్దతు తెలియచేస్తారా అన్నది చూడాల్సి ఉంది.