రూ.5,900 కోట్లు మాయం... అతడి గర్ల్ ఫ్రెండ్ ఎంత పని చేసిందంటే..?

ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చాయో తెలుసా అంటూ మండి పడుతున్నారు.

Update: 2024-11-30 18:30 GMT

ఇంట్లో భార్యో, పిల్లలో.. లేక, స్నేహితులో 10 రూపాయలు పాడు చేస్తేనే కారాలూ, మిరియాలూ నూరుతుంటారు చాలా మంది. ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చాయో తెలుసా అంటూ మండి పడుతున్నారు. అది 10 అయినా, 100 అయినా, లక్ష అయినా సంపాదించేవారికి తెలుస్తుంది నొప్పి అన్నమాట! ఈ క్రమంలో.. ఒక వ్యక్తికి రుమారు రూ.5,900 కోట్ల విలువైన షాక్ ఇచ్చింది తన గర్ల్ ఫ్రెండ్.

అవును... యూకేలోని న్యూపోర్ట్ కు చెందిన హోవెల్స్ అనే వ్యక్తి వద్ద సుమారు 8,000 బిట్ కాయిన్ నిల్వ ఉన్న హార్డ్ డ్రైవ్ ఉందంట. ఈ బిట్ కాయిన్ విలువ ప్రస్తుత మార్కెట్ లో సుమారు 5,900 రూపాయలు అని అంటున్నారు. అయితే... అంత విలువైన హార్డ్ డ్రైవ్ ను ఆమె డస్ట్ బిన్ లో పాడేసిందంట. దీంతో... అతడు కౌంటీకి ఆసక్తికరమైన రిక్వస్టులు చేస్తున్నాడు!

అతడి స్నేహితురాలు ఇటీవల హౌస్ క్లీనింగ్ చేసిందంట. ఈ సమయంలో ఆ హార్డ్ డ్రైవ్ ను బయట పారేసిందంట. దీంతో.. దాన్ని డస్ట్ బిన్ బ్యాగ్ లో పోగు చేసి, సమీపంలోని డంప్ లో పారవేశారట. ఆ హర్డ్ డ్రైవ్ లో అంత విలువైన విషయం ఉందని తెలియక ఆమె ఆ పని చేసింది. తర్వాత తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందుతుందంట.

ఈ సమయంలో న్యూపోర్ట్ అధికారులను తమ చెత్త పారవేయబడిన యూనిట్ ను త్రవ్వడానికి అనుమతించమని ఆమె పదే పదే రిక్వస్టులు చేసిందని చెబుతున్నారు. ఇదే సమయంలో అతడు కూడా తీవ్రంగా రిక్వస్ట్ చేసి ప్రభుత్వం ముందు ఓ ఆఫర్ కూడా పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగాంగా... ఈ డంప్ లో ఉన్న తన హార్డ్ డ్రైవ్ ను వెతకడానికి సహకరిస్తే 10% డబ్బును స్థానిక అభివృద్ధికి విరాళంగా ఇస్తానని చెప్పాడు.

మరోపక్క ఈ సందర్భంగా స్పందించిన న్యూపోర్ట్ అధికారులు... యూకేలోని న్యూపోర్ట్ లో ఉన్నది సుమారు 1,00,000 టన్నుల వ్యార్థాల డంప్ అని.. వాటి మధ్యలో ఎక్కడ ఆమె బ్యాగ్ ఉందో వెతకడం దాదాపు అసాధ్యం అని అంటున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో... అనేక ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలను కలిగి ఉన్నందున తవ్వకం ఆపరేషన్ ను అనుమతించలేమని అంటున్నారంట.

Tags:    

Similar News