బాలకృష్ణ కొడుకు ఫస్ట్ టైం పాలిటిక్స్ లో..?
టీడీపీలో నారా వారితో పాటు బాలయ్య రూపంలో నందమూరి వారు కూడా కీలకంగానే ఉంటున్న సంగతి తెలిసిందే
టీడీపీలో నారా వారితో పాటు బాలయ్య రూపంలో నందమూరి వారు కూడా కీలకంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తాజాగా పొలిటికల్ స్క్రీన్ పై కనిపించారు. ఇలా ఫస్ట్ టైం బాలయ్య కొడుకు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన పొలిటికల్ ఇంట్రస్ట్ పై చర్చ మొదలైంది. తాజాగా యువగళం పాదయాత్రలో లోకేష్ తో పాటు మోక్షజ్ఞ కూడా నడిచారు.
అవును... తాజాగా "యువగళం" పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గం, తేటగుంట వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తో పాటు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా హాజరయ్యారు.
అనంతరం లోకేష్ తో పాటు బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో బాలయ్య కొడుకుకి రాజకీయాలపై ఆసక్తి ఉందా.. లేక, జస్ట్ తన బావకు సపోర్ట్ గానే వచ్చారా అన్నది ఆసక్తికా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి!
కాగా... జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన "యువగళం" పాదయాత్ర పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన సంగతి తెలిసిందే! ఇటీవల చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ రావడంతో ఎన్నో విరామాల అనంతరం యాత్ర తాజాగా మొదలైంది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి గత నెల 26న ఈ యాత్ర పునఃప్రారంభించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో సెప్టెంబర్ 9న రాజోలు నియోజకవర్గంలోని పొదలాడవద్ద లోకేష్ పాదయాత్ర నిలివేశారు. నాటి నుంచి సుమారు యువగళం పాదయాత్ర సుమారు 79 రోజులపాటు ఆగింది.