మోడీ నడ్డా : విశాఖకు క్యూ కడుతున్న కమలదళం ...!

ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే మోడీ విశాఖకు రానున్నారు అని అంటున్నారు.

Update: 2024-02-27 03:56 GMT

విశాఖకు బీజేపీ అగ్ర నాయకత్వం వరసగా రాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన మార్చి నెలలో ఉండబోతోంది. ముందు ప్రకటించినట్లుగా మార్చి 1న జరగాల్సింది వాయిదా పడింది. అయితే తొందరలోనే విశాఖలో మోడీ పర్యటిస్తారు అని అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే మోడీ విశాఖకు రానున్నారు అని అంటున్నారు.

ఆ మీదట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా విశాఖకు వస్తారని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని అంటున్నారు. వీరిద్దరి కంటే ముందు మంగళవారమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ విశాఖ వస్తున్నారు. ఆయన విశాఖలో మేధావులతో ఒక కీలక సదస్సుని నిర్వహించనున్నారు.

విశాఖలోని మేధావులు ప్రముఖులు బీజేపీని అభిమానించే వారందరితోనూ కేంద్ర మంత్రి ఈ సదస్సులో భాగస్తులను చేసి దిశానిర్దేశం చేసారని బీజేపీకి మద్దతు కోరుతారు అని అంటున్నారు. రాజ్ నాధ్ సింగ్ విశాఖ నుంచి ఒక విధంగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు.

ఇక ఏపీలో ఉన్న పాతిక దాకా పార్లమెంట్ నియోజక వర్గాలు కలిపి ఒక క్లస్టర్ గా చేసి ఈ కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీకి మేధావులను కనెక్ట్ చేయడంతో పాటు వారి ప్రచారం ద్వారా మరింత మందిని ఆకట్టుకోవాలనందే బీజేపీ వ్యూహం అని అంటున్నారు.

రానున్న రోజులలో ఏపీలో బీజేపీ కీలక ఎంపీ స్థానాల మీద గురి పెట్టి వాటిని దక్కించుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. బీజేపీ గెలిచిన సీట్లలో విశాఖ ఒకటి. అందుకే ఆ సీటుని మరోసారి దక్కించుకోవాలన్న అజెండాతోనే బీజేపీ ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది అని అంటున్నారు.

ఇక ఎన్నికల కోడ్ రాకముందే విశాఖలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ద్వారా ప్రారంభించాలన్నది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. ఇక జేపీ నడ్డా విశాఖ నుంచే ఎన్నికల సమర శంఖారావం పూరిస్తారు అని అంటున్నారు. మొత్తానికి విశాఖ వేదికగా చేసుకుని బీజేపీ ఎన్నికల ప్రచారానికి దిగిపోతోంది. 2024 ఎన్నిలలో విక్టరీకి గేట్ వే గా విశాఖను చేసుకోవాలని చూస్తోంది.

Tags:    

Similar News