పిల్లి ప్లేసులో ఎవరొస్తారు ?

వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లేసులో ఎవరొస్తారు ? ఇపుడిది చర్చ పార్టీతో పాటు జిల్లాలో మొదలైంది. దీనికి కారణం ఏమిటంటే పార్లమెంటు సమావేశాల తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు స్వయంగా బోసే చెప్పారు కాబట్టి.

Update: 2023-07-24 05:48 GMT

వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లేసులో ఎవరొస్తారు ? ఇపుడిది చర్చ పార్టీతో పాటు జిల్లాలో మొదలైంది. దీనికి కారణం ఏమిటంటే పార్లమెంటు సమావేశాల తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు స్వయంగా బోసే చెప్పారు కాబట్టి. పార్లమెంటు సమావేశాల తర్వాత రాజీనామా చేస్తానని బోసు చెప్పింది నిజమే కానీ దేనికి రాజీనామా చేయబోతున్నారనే విషయంలో క్లారిటిలేదు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. మొదటిది పార్టీకి రాజీనామా చేయటం. రెండోది పార్టీతో పాటు రాజ్యసభ ఎంపీగా కూడా రాజీనామా చేయటం.

పార్టీకి, రాజ్యసభ స్ధానానికి కూడా రాజీనామా చేస్తే అసలు గొడవే ఉండదు. అలా కాకుండా కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా అంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి. బోసు పార్టీకి దూరమైనా, పార్టీతో పాటు ఎంపీ పదవికీ రాజీనామా చేసినా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోక తప్పదు. నిజానికి బోసు తూర్పుగోదావరి జిల్లాలో అంత పట్టున్న నేతేమీకాదు. కాకపోతే వైఎస్ కుటుంబంతో ఆయనకున్న సన్నిహితం కారణంగా అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అయినా ఇఫుడు జగన్ అయినా బాగా ప్రాధాన్యతిస్తున్నారు.

అయితే జగన్ తో సన్నిహితాన్ని బోసు బాగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో కూడా రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణే పోటీచేస్తారని జగన్ ప్రకటన చేయించారు. ఆ ప్రకటనే బోసుకు మండింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తాను లేదా కొడుకు ప్రకాష్ పోటీలోకి దిగాలని బోసు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

టికెట్ ప్రకటన తర్వాత బోసు జగన్ పై తిరుగుబాటు చేసినట్లే కనిపిస్తోంది. పార్టీకి బోసు దూరమైతే ఆ ప్లేసును రీప్లేసుచేయబోయే నేత ఎవరనే విషయమై చర్చలు మొదలయ్యాయి. అలాగే రాజ్యసభ ఎంపీకి కూడా రాజీనామా చేస్తే మళ్ళీ ఎంపీ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే బోసుకు ఇంకా మూడేళ్ళ పదవి బ్యాలెన్సుంది. మూడేళ్ళు రాజ్యసభ ఎంపీగా ఉండటమంటే చిన్న విషయంకాదు. అయితే నిజంగానే బోసు గనుక రాజీనామా చేస్తే మళ్ళీ మరో బీసీ నేతకే జగన్ అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News