నర్సాపురం సీన్ లోకి రఘురామ కొడుకు...?

ఏపీలో కీలకమైన ఎంపీ నియోజకవర్గాలలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఒకటి. ఈ సీటులో 2019 ఎన్నికల్లో రఘురామ క్రిష్ణం రాజు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు.

Update: 2023-08-27 03:45 GMT

ఏపీలో కీలకమైన ఎంపీ నియోజకవర్గాలలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఒకటి. ఈ సీటులో 2019 ఎన్నికల్లో రఘురామ క్రిష్ణం రాజు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన వైసీపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేసి రెబెల్ ఎంపీగా మారారు. ఇక ఆ మధ్యన ఏపీ సీఐడీ అధికారులు రఘురామను ఏపీకి తీసుకుని వచ్చి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.

మొత్తానికి వైసీపీ వర్సెస్ రఘురామగా ఏపీ పాలిటిక్స్ సాగుతోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రఘురామ ఏ పార్టీనుంచి పోటీ చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన తెలుగుదేశంతోనూ జనసేనతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇక బీజేపీతో కూడా ఆయన క్లోజ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తారు.

అలాంటి రఘురామ పోటీ చేస్తారా ఈసారి లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. రఘురామ కొడుకు భరత్ నర్సాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఆయన ఇపుడు నర్సాపురంలో ఉంటున్నారు. నర్సాపురంలో రఘురామ అడుగుపెట్టడంలేదు. ఆయన నాలుగేళ్ళుగా ఆ వైపునకు రావడంలేదు.

దాంతో ఆయన తరఫున అనుచరులకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు భరత్ ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అలా భరత్ పేరు రాజకీయ తెర పైకి వచ్చింది. దాని మీద మీడియా ముందు రెబెల్ ఎంపీ కుండ బద్ధలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు భరత్ ని పోటీకి దించడం లేదని, తానే పోటీ చేస్తాను అని స్పష్టత ఇచ్చారు.

తాను ప్రతిపక్షాల తరఫున ఎంపీ అభ్యర్ధిగా ఉంటాను అని ఆయన అంటున్నారు. అది టీడీపీనా లేక జనసేననా అన్నది చెప్పడంలేదు. మొత్తానికి ఏపీలో విపక్ష కూటమి కడుతుందని, ఆ కూటమి అభ్యర్ధిగా నర్సాపురం నుంచి లోక్ సభకు తాను పోటీ చేస్తాను అని రఘురామ అంటున్నారు.

ఇక ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల వేళ తాను రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తాను అని రఘురామ అంటున్నారు. తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తన కుమారుడు చూసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. అందుకోఅమే భరత్ ని ఫోకస్ లో ఉంచాను తప్ప పోటీకి దించడానికి కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే రెబెల్ ఎంపీ మళ్ళీ నర్సాపురం నుంచే పోటీకి తయార్ అంటున్నారు. టీడీపీ జనసేనల నుంచి కాకుండా కూటమి తరఫున అని ఆయన అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. కూటమి కి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని రఘురామ అంటున్నారు. మరి ఇది ఎక్కువ తక్కువా అన్నది ఆయన చెప్పడంలేదు. ఏది ఏమైనా రఘురామ వైసీపీ కి ఎదురెళ్తాను అని అంటున్నారు. విజయం మాదే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో.

Tags:    

Similar News