ఇట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి !

ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదు.

Update: 2024-06-05 06:19 GMT

''పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్ ను ఓడించకపోతే నా పేరును మార్చుకుంటానన్న మాటపై ఉన్నాను. అన్న మాట ప్రకారం నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేసుకున్నాను. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకుంటా. నా పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు వెల్లడిస్తాను'' అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్శనాభం అన్నారు.

నన్ను ఉప్మా పద్మనాభం పదే, పదే ట్రోల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదు. నా తాతలు, తండ్రి కాలం నుంచి ఈ ఆనవాయితీ నడుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు.

కోట్లాది రూపాయాలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమే, దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని ముద్రగడ అన్నారు. అయినా ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా..? లేకపోతే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడం వల్ల అటువైపు మొగ్గుచూపారు తెలియడం లేదు. ఈ ఎన్నికల్లో గెలిపొందిన నాయకులకు శుభాకాంక్షలు అని ముద్రగడ అన్నారు.

Tags:    

Similar News