పిన్నెల్లి ఎపిసోడ్: ఏపీ సీఈవో మెడకు చిక్కు.. !
అదికూడా అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వీడియోకావడంతో.. వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారు.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా చుట్టూ వివాదం రాజుకుంది. మాచర్లలోని కొన్ని పోలిం గ్ బూతుల్లోఈనెల 13న ఈవీఎంలను ధ్వంసంచేసిన ఘటనలో ఒకే ఒక వీడియోబయటకు వచ్చింది. అదికూడా అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వీడియోకావడంతో.. వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. ఎన్నికల అధికార ప్రమేయం లేకుండా సదరు సీసీ టీవీ ఫుటేజీ బయటకు ఎలా వచ్చిందన్నది వైసీపీ నాయకుల ప్రశ్న..
ఇదే విషయంపై వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక, ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా.. రియాక్ట్ అయ్యారు.. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే ఆయన అనుమతి లేకుండా.. ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేస్తున్న ఫుటేజీ బయటకు వచ్చే అవకాశం లేదన్న వైసీపీ నేతల వాదనను ఆయన తోసిపుచ్చారు. తనకు కూడా తెలియదని..దీనిపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
దీనిపై లోతుగా పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. ఇదేసమయంలో మాచర్లలోని పోలింగ్ బూతుల్లో పనిచేసి న ఆర్వోలు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. అయితే.. ఇప్పటికే మాచర్ల ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎన్నికల సంఘం ఇప్పుడు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో సీఈవో మీనాపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.. ఇదే జరిగితే.. ఎన్నికల కౌంటింగ్ సమయానికి రాష్ట్రంలో మార్పులు తప్పవని తెలుస్తోంది.
వాస్తవానికి ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు మొత్తం మాచర్లలోనే 7 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. వాటి విషయం కూడా బయటకు రావాల్సి ఉంది. కానీ.. ఒక్క పిన్నెల్లికి సంబంధించిన వీడియో.. అది కూడా.. వేరే ఎవరో రికార్డు చేసి బయటకు విడుదల చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం ముఖేష్ కుమార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. దీనిపై రానున్న రోజుల్లో ఉద్యమమే చేయాలని వైసీపీ నిర్ణయించడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.