మంత్రి నాదెండ్ల దూకుడు...అడ్డంగా దొరికారు!
సీజ్ ద షిప్ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు పవర్ ఫుల్ వెపన్ గా పనిచేశాయి.
సీజ్ ద షిప్ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు పవర్ ఫుల్ వెపన్ గా పనిచేశాయి. ఏపీ ప్రభుత్వం మొత్తం అప్రమత్తమైంది. కాకినడ పోర్టుతో పాటు ఏపీలో మొత్తం పోర్టులు అన్నింటి మీద నిఘా పెరిగింది.
ఇంకో వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే దూకుడు పెంచారు. ఆయన సోమవారం విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో అడ్డంగా అక్రమంగా సాగుతున్న రేషన్ బియ్యం రవాణాను అడ్డుకున్నారు. ఏకంగా 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని మంత్రి గుర్తించారు ఆ వెంటనే వాటిని సీజ్ చేశారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఇపుడు ప్రతీ పోర్టులో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తూ పోతున్నారు. అక్రమ బియ్యం ఏ వైపునా కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఒక విధంగా అష్టదిగ్బంధనం చేశారు అని అంటున్నారు.
ఏపీ నుంచి ఒక్క బియ్యం గింజ కూడా బయటకు పోకుండా కఠిన చర్యలనే కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. దీని వల్ల అక్రమార్కులకు గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇక రేషన్ బియ్యం అక్రమ మార్గం పట్టడం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ గా ఉన్నారు అన్నది గత వారం ఆయన ఏకంగా తుఫానుతో అలజడిగా ఉన్నా కూడా సముద్రపు గర్భంలోకి వెళ్లి మరీ షిప్ ని సీజ్ చేయించిన ఉదంతం చెబుతోంది
దాంతో పవన్ కళ్యాణ్ ఎక్కడా ఈ విషయంలో పట్టు వీడేది లేదని స్పష్టం చేసినట్లు అయింది అంటున్నారు. అంతే కాదు గుట్టు మట్టూ అన్నీ కూడా లెక్క తేలుస్తామని కూడా గట్టి హెచ్చరికలు చేసారు. దీంతో బియ్యం అక్రమార్కుల గుండెలలో రైళ్లు పరుగెడుతున్నాయి అని అంటున్నారు.
ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అక్రమ బియ్యం కధ తేల్చేందుకు పూర్తి యాక్షన్ లోకి దిగిపోయారు. ఆయన జిల్లాల పర్యటనలు చేస్తూనే ఆకస్మికంగా పోర్టులలో తనిఖీలు చేస్తున్నారు దాంతో ఏకంగా మంత్రి ఇలా తనిఖీలు చేయడంతో ఎపుడేమి జరుగుతుందో తెలియని స్థితిలోకి అక్రమార్కులు పడ్డారు.
ఈ విధంగా సీజ్ ది షిప్ అంటూ పవన్ ఇచ్చిన ఒకే ఒక ఆర్డర్ ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతే కాదు ఏకంగా ఏపీ నుంచి లక్షల టన్నులలో సాగుతున్న అక్రమ బియ్యం వ్యాపారనికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. ఏ చిన్న అవకాశమూ అక్రమార్కులకు ఇవ్వరాదన్న కూటమి ప్రభుత్వం పెద్దల పట్టుదలతో ఇపుడు అక్రమార్కులకు దారేదీ అన్న చర్చ అయితే సాగుతోంది.
ఏది ఏమైనా డైనమిక్ మినిస్టర్ గా నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖలో కొత్త రికార్డునే క్రియేట్ చేశారు అని అంటున్నారు. రానున్న రోజులలో ఏపీలోని ప్రతీ పోర్టులో ఈ తరహా ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్న సందేశాన్ని పంపిస్తున్నారు. దాంతో ఎక్కడి బియ్యం అక్కడే గప్ చుప్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది.