నాగబాబు న్యూటన్ నియమాలు... తమ్ముళ్ల త్రికోణమితి నిర్వచనాలు!

దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. “ఈ బంధం తెగిపోబోతుందా” అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

Update: 2024-01-27 07:52 GMT

రిపబ్లిక్ డే రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన సీట్లు, అవి ప్రకటించిన విధానాలు, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, ఫలితంగా జరిగిన చర్చలు.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో... టీడీపీ - జనసేన బంధం బీటలు వారుతుందంటూ కొందరు కామెంట్ చేస్తే... "జనసేనతో మనకు అవసరమా" అంటూ మరికొందరు వ్యాఖ్యానించారని కథనాలొచ్చాయి.

పైగా మూడోవంతు (సుమారు 60) సీట్లలో పోటీకి సిద్ధపడుతున్నట్లు పవన్ ప్రకటించడంతో టీడీపీలో ఒక్కసారిగా ప్రకంపనలు రాగా, తమ్ముళ్లు బిగ్ షాక్ కి గురయ్యారు. గత ఎన్నికల్లో 1 సీటు గెలుచుకున్న పార్టీ మూడోవంతు అడిగితే ఎలా అనే చర్చ కూడా తెరపైకి తెచ్చారని తెలుస్తుంది! ఇక్కడికే వ్యవహారం తీవ్రమవుతుంటే... ఆ అగ్నికి ఆన్ లైన్ వేదికగా ఆజ్యం పోస్తున్నట్లుగా స్పందించారు జనసేన నేత నాగబాబు!!

అవును... పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు.. మండపేట, అరకు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారంటూ స్పందించిన పవన్... తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తానంటూ రాజోలు, రాజానగరం నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు తరహాలో అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయారు. ఈ సమయంలో... నాగబాబు ట్విట్టర్ వేదికగా న్యూటన్ గమన నియామాలను ప్రస్థావిస్తూ పోస్ట్లు పెట్టారు.

దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. “ఈ బంధం తెగిపోబోతుందా” అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో... “పవన్ వెనుక ఎవరుండి ఈ మాటలు మాట్లాడిస్తున్నారు” అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. ఏది ఏమైనా... పవన్ సీట్లను ప్రకటించగానే... "ఒక చర్యకు ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకదిశలో సమానమైన ప్రతిచర్య ఉంటుంది" అని పోస్ట్ చేశారు నాగబాబు. దీన్నే “చర్య - ప్రతిచర్య నియమం” అని కూడా అంటారు. ఇది న్యూటన్ మొదటి గమన నియమం అనేది తెలిసిన విషయమే!

దీంతో... టీడీపీకి షాకిచ్చేలా ఈ పోస్ట్ పెట్టారనే చర్చ మొదలైంది. పొత్తులో భాగంగా టీడీపీ ఎలా నడుచుకుంటే.. తాము లానే నడుచుకుంటాము. అలా కాకుండా పెత్తనం చేయాలని, తామేదో పెద్దోళ్లం అన్నట్లుగా టీడీపీ భావిస్తే... జనసేన కూడా అంతకు మించి అన్నట్లుగా ప్రవర్తిస్తుంది అని నాగబాబు ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పినట్లయ్యిందనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. ఇది వాస్తవం అనే కన్ క్లూజన్ పరిశీలకుల నుంచి వినిపిస్తుంది.

అది అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే.. ఆ ఫ్లోని కంటిన్యూ చేసిన నాగబాబు... న్యూటన్ మొదటి గమన నియమం అంటూ మరో పోస్ట్ పెట్టారు. అంటే... "బాహ్య బలప్రయోగం లేనంతవరకూ నిశ్చలంగా ఉన్న వస్తువు నిశ్చలముగాను, కదులుతున్న వస్తువు అదే స్థితిలో ఉంటుంది" అన్నమాట! దీంతో... సైలంట్ గా ఉన్న తమను కదిపితే కచ్చితంగా కదులుతాం అని నాగబాబు ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో న్యూటన్ రెండో నియమం అంటూ మరో పోస్ట్ చేసిన నాగబాబు... "నేను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటది అనుకోవద్దు. కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను. ఇవ్వాల ఫిజిక్స్ లాస్ చేసాను.. రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను" అని రాస్తూ... "నోట్: వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు" అని ముగించారు. దీంతో... వ్యవహారం చినికి చినికి గాలివానగా మారేట్లుందనే చర్చ మొదలైంది.

రాజకీయాలపైనా, నాగబాబు పైనా ఎంతో కొంత అవగాహన ఉన్నవారికి ఈ పోస్టుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది స్పష్టంగా అర్ధమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ పోస్టులు చూసి టీడీపీ తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా... 40ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి, సుమారు 40శాతం ఓటు బ్యాంక్ కలిగి ఉన్న పార్టీకి ఈ పరిస్థితి అవసరమా అని స్పందిస్తున్నారు.

ఇదే సమయంలో నాగబాబు పోస్టులకు పలువురు నెటిజన్లు పెట్టిన కామెంట్లు... చంద్రబాబు, లోకేష్ ప్రొఫైల్ పిక్స్ తో ఉన్న అకౌంట్ల నుంచి వచ్చిన రిప్లైలు, కామెంట్లు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఇందులో భాగంగా.. “ఒక త్రిభుజం యొక్క ఒక కోణం, సమానంగా ఉన్న ఇతర రెండు కోణాల మొత్తానికి సమానంగా ఉంటే దానిని లంబ కోణ త్రిభుజం అంటారు” అని కామెంట్ పెట్టారు! "అయితే ఇప్పుడు ఏమిటి?" అని అర్ధమో ఏమో తెలియదు కానీ... ఇలా ఫిజిక్స్, మ్యాథ్స్ నియమాలతో టీడీపీ - జనసేన మధ్య ఆన్ లైన్ వేదికగా రవత్తర పోరే జరుగుతుంది!!






 


Tags:    

Similar News