ఓట్ల వివాదంపై స్పందించిన నాగబాబు... కీలక వ్యాఖ్యలు!

అవును... తనపై వస్తున్న ఓట్ల వివాదంపై నాగబాబు స్పందించారు. తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని తెలిపారు.

Update: 2023-12-18 10:00 GMT

కొన్ని రోజులుగా జనసేన కీలక నేత నాగబాబు ఏపీలో ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నారని.. మంగళగిరిలోని జనసేన నేత ఇంటి అడ్రస్ మీద తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. తెలంగాణలో ఓటు వేసి, ఏపీలో కూడా వెయ్యాలని ప్రయత్నిస్తున్నారా అంటూ వైసీపీ నేతలు ఫైరయ్యారు. ఈ సమయంలో నాగబాబు వివరణ ఇచ్చారు.

అవును... తనపై వస్తున్న ఓట్ల వివాదంపై నాగబాబు స్పందించారు. తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తనకు ఉన్న ఓటును రద్దు చేసుకున్నట్లు తెలిపిన ఆయన... అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తన ఓటును ఏపీకి మార్చుకొని టీడీపీ - జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... హైదరాబాద్ లో ఓట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో కొత్త ఓట్ల కోసం ధరఖాస్తు చేసుకున్నమాట వాస్తమేనని తెలిపారు. ఇందులో భాగంగా తనతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలు, కోడలుకు ఏపీలో ఓటు హక్కుకు అప్లై చేసుకున్నట్లు తెలిపారు. అయితే... ఏ ఇంటి అడ్రస్ మీద అనే విషయంపై మాత్రం స్పందించలేదు!

నెల్లురులో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగబాబు ఏపీలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్ల ఇష్యూపై ఈ విధంగా స్పందించారు. అనంతరం ఎన్నికలకు మూడు నెలలో సమయం ఉందని, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అనీల్ కుమార్ యాదవ్ ప్రస్థావన తెచ్చిన ఆయన... జలవనరుల శాఖ మాజీ మంత్రి ఏడాదిలో పోలవరం పూర్తిచేస్తామన్నారని, ఇప్పుడు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదని అన్నారు. ఇదే సమయంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని నాగబాబు తెలిపారు.

కాగా... తెలంగాణలో ఉన్న ఓటు హక్కుని ఆ ఎన్నికల్లో వినియోగించుకుని.. అనంతరం ఏపీలో వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. ఎన్నికలు జరిగే ప్రతీసారీ ఈ తరహా పనులు కొన్ని పార్టీల కార్యకర్తలు పనిగట్టుకుని చేస్తున్నారని.. ఇలాంటి విషయాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News