వైరల్ వీడియో... బాలకృష్ణ వెళ్లగానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు!

గతకొంతకాలంగా జూనియార్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అనే రచ్చ, తదనుగుణంగా విపరీతమైన చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-01-18 06:25 GMT

గతకొంతకాలంగా జూనియార్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అనే రచ్చ, తదనుగుణంగా విపరీతమైన చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అనే వివాదం కూడా కొనసాగుతుందనే చర్చ కూడా ఆమధ్య మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ చర్చకు బలం చేకూర్చేలా అన్నట్లుగా ఒక ఘటన ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా చోటుచేసుకుంది! ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... గతకొంతకాలంగా వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి దూరం పెడుతున్నారనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే టీడీపీ మీటింగుల్లో జూనియర్ ఫ్లెక్సీలు కనిపిస్తే... ఆ ఫోటోలను చింపడం, వాటిని ప్రదర్శిస్తున్నవారిని తన్నడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక అనూహ్య పరిణామం జరిగింది. దీంతో... జూనియర్ వర్సెస్ బాలయ్య అనే చర్చ తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి కావడంతో... వేకువ జామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ కలిసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్థంతి నాడు జూనియర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. అదే క్రమంలో ఈ రోజు కూడా నివాళి అర్పించేందుకు ఘాట్ కు వెళ్లారు!

ఈ సందర్భంగా అక్కడికి జూనియర్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలకు జూనియర్ ఎక్కడా స్పందించలేదు. తాతకు నివాళులు అర్పించి అక్కడనుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో బలమైన స్లోగన్స్ రాశారు!

అనంతరం మిగతా నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన తండ్రి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. అయితే... బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లిన వెంటనే అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఒక్కసారిగా తొలగించడం మొదలుపెట్టారు. దీంతో... బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలగించారని అంటున్నారు!

ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ మీటింగుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే గొడవకు దిగుతూ, అభిమానులపై దాడులు చేస్తూ... ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలను సైతం కావాలని తొలగించడం ఏమిటంటూ ఫైరవుతున్నారు. అసలు జూనియర్ ని ఏమి చేద్దామని వారి ఆలోచన అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా... ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ అభిమానులు ఫైరవుతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిప్పుల్లు కక్కుతున్నారు.

Tags:    

Similar News