'సమయం ఆసన్నమైంది'... జగన్ ను "మెమో"తో తగులుకున్న లోకేష్!

ఏపీలో ఇప్పుడు ఎవరి హయాంలో ఎవరు ఎక్కువ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయంపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి

Update: 2024-10-16 11:06 GMT

ఏపీలో ఇప్పుడు ఎవరి హయాంలో ఎవరు ఎక్కువ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయంపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రజాధనం నువ్వు ఎక్కువ పాడుచేశావంటే.. ఆ విషయంలో నువ్వు పీజీ చేశావంటూ మరొకరు ఫైరవుతున్నారు. ఇలా సాగుతున్న వ్యవహారంలో తాజాగా నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు.

అవును... ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి హయాంలో ఎక్కువ ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందనే విషయంపై రగడ నెలకొంది. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలో ఆయన ఇంటి చుట్టూ కట్టిన ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ విమర్శించింది.

అయితే... అసలు ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ "బాబు దుబారా" అని ఓ పోస్టర్ విడుదల చేసింది వైసీపీ. ఇదే సమయంలో 2014-19 మధ్య సొంత ఇళ్లకు.. హైదరాబాద్, విజయవాడల్లోని అద్దె ఇళ్లకు సైతం పబ్లిక్ ఫండ్స్ ఉపయోగించారంటూ వైసీపీ విరుచుకుపడుతోంది.

ఈ సమయంలో నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా 19 జూలై 2021న జగన్ సర్కార్ హయాంలో ఇచ్చిన మెమో నెంబర్ 980660/పీఅర్వో.ఏ./ఏ2/2019 ని పోస్ట్ చేస్తూ... ఈ విధంగా జగన్ రూ.12.85 కోట్లు స్వాహా చేశారని.. తన వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రజల సొమ్ము వాడారని విమర్శిస్తూ ఎక్స్ లో పేర్కొన్నారు.

“జగన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఇనుప కంచెను నిర్మించాడు.. దానికి పూర్తిగా నగదు కొరత ఉన్న రాష్ట్ర ఖజానా చెల్లించబడింది” అని లోకేష్ తెలిపారు. పేదళ ఇళ్ల కోసం ఖర్చు చేయగల్లిగే భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి జగన్ అత్యవసర భద్రతా కారణాలను ఉదహరించారని మెమోలో ఉన్న అంశాలను ప్రస్థావించారు.

ఈ సందర్భంగా.. జగన్ తన ఆనందాల కోశం విచ్చలవిడిగా ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని లోకేష్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News