వైసీపీ విమర్శలకు నారా భువనేశ్వరి స్ట్రాంగ్ రియాక్షన్
అయితే.. ఈ సారి మాత్రం ఆమె.. తాజాగా మీడియాతో మాట్లాడారు. నిజం గెలవాలి యాత్ర చేయడం ద్వారా బాధిత కుటుంబాలను కలుసుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. `నిజం గెలవాలి` పేరుతో ఆమె చేస్తున్న యాత్రల్లో గత ఏడాది చంద్రబాబు అరెస్టు అయి, 52 రోజుల పాటు జైల్లో ఉన్న నేపథ్యంలో ఆ ఘటనలను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఆమె పర్యటిస్తున్నా.. ఇప్పటి వరకు సైలెంట్‌గా కార్యక్రమాలను చేసుకుని పోతున్నారు. అయితే.. ఈ సారి మాత్రం ఆమె.. తాజాగా మీడియాతో మాట్లాడారు. నిజం గెలవాలి యాత్ర చేయడం ద్వారా బాధిత కుటుంబాలను కలుసుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.
"మేం చేసేది చిన్న సాయం. వారి కుటుంబాలు పార్టీకోసం.. పెద్దాయన(చంద్రబాబు)కోసం.. అలమటించాయి. గుండెలాగి ఎంతో మంది చనిపోయారు. ఆ షాక్ నుంచి వారి కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. అందుకే వారిని ఊరడించేందుకునేను స్వయంగా వస్తున్నాను. కానీ, నాపైనా విమర్శలు చేస్తున్నారు. నేరుగా వచ్చి రాజకీయం చేస్తున్నానని అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.కానీ ఇది సరికాదు. వారి వారి అకౌంట్లలో సొమ్ములు వేయొచ్చు. కానీ, నేను వారిని నేరుగా కలుసుకుంటే.. బాధితులకు కొండంత అండ ఉంటుంది. అందుకే వారిని కలుస్తున్నాను. వారికి మనస్సాంతి కలగాలని కోరుతున్నారు." అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి.. దర్శి నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్య వచనాలు చెప్పారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. తురిమెళ్ళ పరిశుద్ధరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పరిశుద్ధరావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు మూడు లక్షల చెక్కును భువనేశ్వరి అందజేశారు. మొత్తంగా నిజం గెలవాలి పర్యటనలపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై నారా భువనేశ్వరి ఘాటుగా స్పందించడం గమనార్హం.