బిగ్ బ్రేకింగ్: స్కిల్ కేసులో తీర్పు విడుదల!

స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి.

Update: 2023-09-10 13:35 GMT

స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. చంద్రబాబు అరెస్ట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ను సీఐడీ అధికారులు ఆదివారం ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ తరుపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరుపున సిద్ధార్థ్ లూథ్రా లు పోటీపోటీగా తమ తమ వాదనలు వినిపించారు. సెక్షన్ 409 పైనే సుమారు రెండుగంటల పాటు వాదనలు జరిగాయని తెలుస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ కోరినట్టు కస్టడీకి ఇస్తారా? రిమాండ్‌ రిపోర్టు తిరస్కరించి బెయిల్‌ ఇస్తారా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

ఈ సమయంలో తాజాగా న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా సంచలన తీర్పు ఇచ్చారు! ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పు కోసం లక్షల మంది తెలుగువారు టీవీలకు అతుక్కుపోయి ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన పరిస్థితి! ఈ సమయంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

ఈ సమయంలో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతూ చంద్రబాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో తీర్పు అనంతరం చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించాలని సూచించారు.

దీంతో ఈ నెల 22 వరకూ చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండబోతున్నారు!

Tags:    

Similar News