బాబుని వైసీపీ ఆ మాట ఇక అనలేదంతే..!

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో వైసీపీ చాలా దూకుడుగా ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా చెడుగుడు ఆడేసుకుంటుంది. ఇక ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో అయితే వైసీపీ స్పీడ్ ఒక లెవెల్ లో ఉంటుంది.

Update: 2023-07-23 14:55 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో వైసీపీ చాలా దూకుడుగా ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా చెడుగుడు ఆడేసుకుంటుంది. ఇక ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో అయితే వైసీపీ స్పీడ్ ఒక లెవెల్ లో ఉంటుంది. కుప్పంలో చంద్రబాబు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

మూడు సార్లు సీఎం గా ఉన్నారు. మరో మూడు సార్లు విపక్ష నేతగా ఉన్నారు. ఇక తొలిసారి కుప్పం నుంచి గెలిచినపుడు శాసనసభలో టీడీపీ పక్షం ఉప నేతగా బాధ్యతలు నిర్వహిస్తే రెండవసారి గెలిచాక రెవిన్యూ ఆర్ధిక మంత్రిత్వ శాఖలను చూశారు.

ఇన్ని సార్లు కుప్పం నుంచి గెలుస్తున్నా చంద్రబాబుకు అక్కడ ఇల్లు లేదు. ఈ తప్పుని పట్టుకుని వైసీపీ ఆయన్ని పెద్ద ఎత్తున ర్యాగింగ్ చేసి పారేసింది. ఇక కుప్పంలో ఇల్లే లేని చంద్రబాబుని ఏడుసార్లు గెలిపించినా ఉపయోగం ఏంటి అంటూ గట్టిగానే ప్రశ్నించింది. కుప్పంలో బాబు నాన్ లోకల్ అని స్లోగన్స్ ఇచ్చింది.

దాంతో పాటు రెండేళ్ల క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ అన్ని చోట్లా ఓడిపోయింది. దాంతో కుప్పం కోటనే బద్ధలు కొడతామని వైసీపీ రెట్టిస్తోంది. దీంతో అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ కాస్తా బాబు వర్సెస్ వైసీపీగా మారిపోయింది. బాబుకి ఇల్లు కూడా లేదు అన్న మాట మాత్రం జనాల్లోకి సెంటిమెంట్ గా వెళ్ళిపోయింది.

ఈ యాంటీ సెంటిమెంట్ ని తట్తుకోవడం కష్టమన్న భావనకు వచ్చిన చంద్రబాబు ఎట్టకేలకు ఇల్లు కట్టుకునేందుకు డిసైడ్ అయ్యారు. ఆయన చాన్నాళ్ల కిర్తం కుప్పంలో వంద సెట్ల భూమి కొన్నారు. అది జాతీయ రహదారికి ఆనుకుని కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నారు.

తాను ఇల్లు కట్టుకుంటాను అని చంద్రబాబు అనుమతి కోసం అధికారులకు ఇప్పటికి ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇన్నాళ్ళకు ఆయనకు అనుమతిని ఇస్తూ పీఎంకే హుడా అధికారులు ఓకే చేశారు. దాంతో చంద్రబాబు ఇంటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని అంటున్నారు.

చంద్రబాబు దాదాపుగా అయిదు వందల గజాల స్థలంలో బ్రహ్మాండమైన ఇంటినే నిర్మించుకుంటారు అని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలకు పైగా సమయం ఉన్నందున ఈలోగా ఇల్లు కట్టి ఎన్నికల వేళకు సొంతింటి వాడుగా కుప్పలో అడుగుపెడతారు అని అంటున్నారు. 2024 ఎన్నికలకు చంద్రబాబుని ఈ విషయంలో విమర్శించడానికి వైసీపీకి ఎలాంటి అవకాశం లేకుండా బాబు చేసుకున్నారు అని అంటున్నారు.

నిజానికి టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అయితే ఎన్నికల వేళ దాకా ఊరుకుని అపుడు సొంతిల్లు లేదని యాగీ చేసి ఉంటే రాజకీయ లాభం కలిగేది అని అంటున్నారు. అయితే లోకల్ బాడీ ఎన్నికలలో గెలిచేశాక వైసీపీ అతి ఉత్సాహంతో బాబు మీద చేసిన దూకుడుతో ఆయన అంతే స్థాయిలో జవాబు ఇచ్చారని, ఫలితంగా బాబు కుప్పం శాశ్వత వాసిగా మారిపోతున్నారు అని అంటున్నారు. ఈ పుణ్యం అంతా వైసీపీదే అంటున్నారు. మొత్తానికి వైసీపీ తన దూకుడుతో టీడీపీకి బాబుకు కుప్పంలో ఎనలేని మేలు చేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News