విజన్ 2047... ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలి!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏమి జరిగినా అది తనవల్లే అని చెప్పుకుంటూ బండి నెట్టుకొస్తుంటారని చంద్రబాబుపై కామెంట్స్ వినిపిస్తుంటాయి.
అర్ధజ్ఞానానికి అజ్ఞానానికి మధ్య కొట్టిమిట్టాడుతూ అదే జ్ఞానం అని భ్రమపడటంలో తప్పు లేదు కానీ... ఆ భ్రమను ప్రజలపై నిరాటంకంగా రుద్దాలనుకోవడం, అందుకు మీడియా బలంగా సపోర్ట్ చేయడం వంటివి అత్యంత ప్రమాధం అని అంటుంటారు. దానికి విజన్ అని, అనుభవం అని రకరకాల పేరు పెట్టడం, జనాల్లోకి వదలడం వరకూ ఓకే కానీ.. వాటికి ఇప్పటి రోజుల్లో ప్రజలు నమ్మడం ఇకపై సాధ్యంకాకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి ఆలా ఉంటే... ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప పని జరిగినా, మరి ముఖ్యంగా ఇండియా మొత్తం మీద, అత్యత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏమి జరిగినా అది తనవల్లే అని చెప్పుకుంటూ బండి నెట్టుకొస్తుంటారని చంద్రబాబుపై కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఆ కామెంట్స్ కి మరింత బలం చేకూర్చేలా చంద్రబాబు వ్యాఖ్యానిస్తుంటారని అంటుంటారు.
ఉదాహరణకు చంద్రబాబు నిత్యం చెప్పే మాటల్లో... హైదరబాద్ ను తానే అభివృద్ధి చేశానని!! ఈ ఒక్క మాటపై తెలంగాణ నేతలు చంద్రబాబుని వాయించి వదిలిన సందర్భాలెన్నో! ఈ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారని దారుణమైన సెటైర్స్ పడుతుంటే... ఎర్రగడ్డలో కొన్ని రోజులు మందులు వాడితే ఇకపై అలాంటి ఆలోచనలు రావనే సెటైర్లు అసెంబ్లీ సాక్షిగా వేసిన పరిస్థితి!
ఈ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కి విజన్-2029 డాక్యుమెంట్ ను చంద్రబాబు రూపొందించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అమరావతి ప్రాజెక్ట్ చేతపట్టి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారని అంటుంటారు. ఫలితంగా 2029 సంగతి దేవుడెరుగు. 2019 ఎన్నికల్లో ప్రజలు అత్యంత ఘోరంగా.. పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓడించారు!
ఈ సమయంలో ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో తాజాగా భారతదేశం ఐదో స్థానానికి వచ్చిందని ప్రధాని ఎర్రకోటపై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించే లక్ష్యంతో పంచ వ్యూహాలతో విజన్-2047 డాక్యుమెంట్ ను రూపొందించినట్లు చెప్పుకొస్తున్నారు చంద్రబాబు.
తాజాగా దీనికి సంబంధించిన ఒక సభను విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సభా ప్రాంగణలో వేసిన కుర్చీల్లో నూటికీ 90శాతం ఖాళీగా ఉన్నాయన్నా అతిశయోక్తి కాదనేలా ఉంది పరిస్థితి! అందుకు సంబంధించిన వీడియోలు చూసినా ఒక క్లారిటీకి వచ్చే ఛాన్సుంది. వచ్చిన జనం సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వయసు ప్రభావమో.. లేక, విజయసాయిరెడ్డి చెప్పే అల్జీమర్స్ ఎఫెక్టో.. అదీగాకపోతే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు జెనిటిక్స్ ఎఫెక్టో తెలియదు కానీ... “బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది” అని వాదించినట్లుగానే... "ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలి" అని చెప్పుకొచ్చారు. దీంతో జరుగుతున్న ట్రోలింగ్స్ సంగతి ఒకెత్తు అయితే... “టీడీపీ పరిస్థితి ఇది” అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒక పక్క యువగళం యాత్ర పేరుచెప్పి నారాలోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఒకెత్తు అయితే.. తాజాగా ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలనే చంద్రబాబు మాటలు మరొకెత్తు అని.. విజనరీ సంగతి కాసేపు పక్కనపెడితే... ఆరోగ్యపరిస్థితిపై దృష్టి సారించాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా... తనదైన రాజకీయ అనుభవంతో, విజన్ తో "పార్టీ లేదు %$#@ లేదు" అని ఆ పార్టీ ఏపీ చీఫ్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు ఏపీ ప్రజలు!
ఇలా 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకొంటున్న చంద్రబాబు.. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల “ప్రజలకు ఒక క్లారిటీ” వచ్చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాబోయే ఎన్నికల అనంతరం టీడీపీ ఫ్యూచర్ పై నీలినీడలు కమ్ముకున్నాయని చెబుతున్నారు.