షా తో లోకేష్... ఎవరి వల్లా సాధ్యంకాలేదా?

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే

Update: 2023-09-28 05:28 GMT

దాదాపు పదకొండు, పన్నెండు రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... అరెస్ట్ చేస్తారనే భయంతోనే లోకేష్ ఢిల్లీలో దాక్కున్నారని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం స్కిల్ డెవలప మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని హస్తినలోని పెద్దలకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో "హస్తినలో కింగులము" అని చెప్పుకునే వారు సైతం లోకేష్ కి ఒక విషయంలో హెల్ప్ చేయలేకపోయారని అంటున్నారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఈయన అరెస్ట్ తర్వాత కొన్ని రోజులకు నారా లోకేష్, ఢిల్లీ వెళ్లారు. అక్కడ పలువురు ఎంపీలను కలిశారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తన వెర్షన్ చెప్పుకున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో 371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ ఎంపీలతో పాటు లోకేష్ మంగళవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ ఫోటోలు షేర్ చేశారు! అయితే హస్తినలో లోకేష్ ఆశించిన పెద్దలు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలుస్తుంది.

అసలు నారా లోకేష్ హస్తిన పర్యటన వెనుక ఉన్న ప్రధాన అజెండా.. హోమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అని అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ విషయంలో లోకేష్ కు బడా బడా నేతలు ఎవరూ హెల్ప్ చేయలేదని సమాచారం. టీడీపీ ఎంపీలు కానీ... టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు కానీ లోకేష్ కు షా అపాయింట్ మెంట్ ఇప్పించలేకపోయారని అంటున్నారు.

ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం అమె పార్టీ నెంబర్ 2 అపాయింట్ మెంట్ ఇప్పించడంలో సహకరించలేదా, సక్సెస్ అవ్వలేదా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇక అపాయింట్ మెంట్ లేకుండా ఎంతోమది కేంద్రమంత్రులతో నేరుగా కలిసే అవకాశం తనకు ఉందని చెప్పుకునే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం చేతులు ఎత్తేశారని తెలుస్తుంది!

ఈ క్రమంలో మరో ఆప్షన్ లేక లోకేష్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరోపక్క యువగళం పాదయాత్ర 29వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో లోకేష్ ను ఏ-14 గా పేర్కొంటూ సీఐడీ మెమో దాఖలు చేసిన పరిస్థితి. దీంతో... ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లోకేష్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది వేచి చూడాలి.

Tags:    

Similar News