లోకేష్ ఫ్యామిలీ ట్రిప్... ఆల్ హ్యాపీయేనా...?

సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ నెల 31వ తేదీ వరకూ తెలుగుదేశం పార్టీకి గండాలే గండాలు.

Update: 2023-11-12 03:54 GMT

సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ నెల 31వ తేదీ వరకూ తెలుగుదేశం పార్టీకి గండాలే గండాలు. క్షణమొక యుగంగా గడచింది. మరి ఈ గండాలు ఏమిటి అంటే దిగ్గజ నేత చంద్రబాబు అరెస్ట్. ఏమి చేయాలో పాలుపోని వైనం. అటు పార్టీ ఇటు కుటుంబం అంతా కలసి తల్లడిల్లినా ఢిల్లీకి పరుగులు తీసినా అక్కడ లోకేష్ బాబు ఇరవై రోజులకు పైగా గడిపినా కూడా బాబు జైలు రోజుల సంఖ్య అలా పెరిగిపోతూనే ఉంది.

మొత్తానికి కష్టాలలో చిన్న ఊరట. అదే కొండత భరోసా అన్నట్లుగా బాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 28 వరకూ ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో హ్యాపీగా ఉండవచ్చు. ఆయన కంటి ఆపరేషన్ కోసమే ఈ బెయిల్ ఇచ్చారు. కంటికి ఆపరేషన్ జరిగింది. రెస్ట్ కూడా దొరికింది.

ఇక స్కిల్ స్కాం కేసులో బాబు సుప్రీం దాకా వెళ్లారు. సెక్షన్ 17 ఏ కనుక బాబుని వర్తిస్తే ఆయన మీద ఉన్న కేసులు అన్నీ మబ్బుల మాదిరిగా పక్కకు తొలగిపోతాయి. బాబు నిప్పు అని చెప్పుకోవడానికి నూరు శాతం వీలు ఉంటుంది. అందుకే దీపావళి పండుగ తరువాత సుప్రీం కోర్టు తీర్పు కోసం కోటి కనులతో అటు నారా ఫ్యామిలీ ఇటు టీడీపీ అంతా ఎదురుచూస్తున్నారు.

ఇక దాదాపు రెండు నెలలుగా కంటికి కునుకు లేకుండా గడపిన నారా లోకేష్ ఇపుడు కాస్తా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉన్నారు. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చలు అంటూ అక్కడ బిజీ అయ్యారు. అలాగే జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక అటు పార్టీ ఇటు తండ్రి అరెస్ట్, మరో వైపు కుటుంబం అన్నీ చూసుకుంటూ వచ్చారు.

ఇపుడు జస్ట్ కొంత టైం దొరికింది. ఈ షార్ట్ టైం లో తన సతీమణి నారా బ్రాహ్మణిని తన కుమారుడు దేవాన్ష్ ని తీసుకుని లోకేష్ ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడే ఆయన దీపావళి కూడా జరుపుకుంటారు అని అంటున్నారు. లోకేష్ మళ్లీ ఎపుడు వస్తారు అంటే ఈ నెల 15 న అని అంటున్నారు.

మొత్తానికి కష్టాలు అన్నీ ఒకేసారి కట్టకట్టుకుని వచ్చేసినట్లుగా నారా ఫ్యామిలీ ఇబ్బంది పడింది. ఇపుడు బాబు ఇంట్లో ఉన్నారు. చినబాబు కాస్తా రిలాక్స్ మూడ్ లోకి వచ్చారు. 15 తరువాత నుంచి ఇక ఎన్నికలు ముగిసేంతవరకూ వీర లెవెల్ లో దూకుడు చేస్తారని రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారని అంటున్నారు. ఈ మధ్యలో ఫ్యామిలీ ట్రిప్ ఫుల్ ఎనర్జీ ఇస్తుందని కూడా భావిస్తునారు.

Tags:    

Similar News