భవిష్యత్ నాయకుడు లోకేష్.. నందమూరి వాళ్లకు ఛాన్స్ లేదా?
ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్.. అరెస్టులకు భయపడేదే లేదన్నారు. జగన్ మీద ప్రతీకారం తీర్చుకుంటామనేలా మాట్లాడారు
తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ దేనా పెత్తనం? టీడీపీ భవిష్యత్ నాయకుడు ఆయనేనా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. ఆయన అరెస్టు, రిమాండ్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఆ దిశగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సారథ్యంలోనే ముందుకు సాగుతామని టీడీపీ సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్.. అరెస్టులకు భయపడేదే లేదన్నారు. జగన్ మీద ప్రతీకారం తీర్చుకుంటామనేలా మాట్లాడారు. చంద్రబాబు ప్రజల మనిషి అని చెప్పారు. దీంతో ఇప్పుడు లోకేష్ నేత్రుత్వంలోనే పార్టీ సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో లోకేష్ ను అసలైన లీడర్గా చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే లోకేష్ కేంద్రంగానే అన్నీ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో నారా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత దక్కడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల నుంచి బాబు తప్పించారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటున్న ఎన్టీఆర్.. బాబు అరెస్టు, రిమాండ్ పై స్పందించలేదు. ఇక పార్టీ కార్యాచరణ కోసం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. కానీ దీని గురించి బయటకు రానివ్వలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా బాలక్రిష్ణ విలేకర్లతో మాట్లాడారు. అయినప్పటికీ పార్టీ భవిష్యత్గా లోకేష్ నే మార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని అంచనా