టీడీపీ సభ్యులను కుక్కలతో పోల్చిన డిప్యూటీ సీఎం

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే

Update: 2023-09-22 08:03 GMT

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు కూడా సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ సభ్యులపై మంత్రి నారాయణస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

ఆ కుక్కలు గ్రామాల్లో మొరిగితే ఈ కుక్కలు సభలోకి వచ్చి మొరుగుతున్నాయి అంటూ టీడీపీ సభ్యులనుద్దేశించి డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఆయన ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేశాడని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలచే ఎన్నుకోబడిన ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులు కుక్కల కన్నా అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక, టీడీపీ సభ్యులపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు దమ్ముంటే స్కిల్ స్కాంపై చర్చకు రావాలని కాకాణి సవాల్ విసిరారు. టీడీపీ సభ్యుల రౌడీయిజం చూసి భయపడబోమని, విజిల్స్ వేస్తూ దేవాలయం లాంటి అసెంబ్లీలో బల్లలు ఎక్కి అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు బజారు కూతలు కూస్తే ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. తమను కుక్కలతో పోల్చిన నారాయణస్వామి వ్యాఖ్యలపై, కాకాణి కామెంట్లపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News