మోడీవన్నీ ఎన్నికల హామీలేనా ?
హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ని ఇన్ స్టిట్యూబ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా అప్ గ్రేడ్ చేయబోతున్నట్లు ప్రకటించారు
మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజా గర్జన బహిరంగ సభలో నరేంద్ర మోడీ తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. మోడీ మాట్లాడింది చూస్తుంటే అంతా ఎన్నికల స్టంటే అని అర్ధమైపోతోంది. ఎన్నికల్లో గెలవడానికి ఒక్కోపార్టీ ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తుందనటంలో సందేహం లేదు. ఇందులో భాగంగానే మోడీ మాట్లాడుతూ జనాలను ఆకర్షించేందుకు అనేక వరాలు ప్రకటించారు. అవేమిటంటే ములుగులో కేంద్రీయ ట్రైబల్ యూనివర్సిటీ చేస్తారట. దీన్ని సమ్మక్క-సారలక్క పేరుతో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. తెలంగాణాలో పసుపు పండించే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా ఆదుకోవటం కోసమే జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. నిజానికి నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది. ఇన్ని సంవత్సరాలు పట్టించుకోని పసుపు బోర్డు ఏర్పాటును మోడీ ఇప్పుడే ఎందుకు ప్రకటించినట్లు ?
హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ని ఇన్ స్టిట్యూబ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా అప్ గ్రేడ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ప్రకటించినవన్నీ అచ్చంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేసినట్లుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రావాలన్నది మోడీ ఆలోచన. అయితే అధికారంలోకి వచ్చేమార్గం ఏమిటో మాత్రం తెలీటంలేదు. బీజేపీకి ఒకపుడు ఉన్న ఊపు ఇపుడు కనబడటం లేదన్నది వాస్తవం. రాజకీయంగా నేతల్లో చాలామంది నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీలో ఉండాలో లేకపోతే బయటకు వచ్చేయాలో తేల్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.
అందుకనే రాజకీయ వ్యవహారాలను వదిలేసి అభివృద్ధి పేరుతో మోడీ హామీలను ఇచ్చారు. నిజానికి ఇపుడు మోడీ ప్రకటించిన వరాలన్నీ చాలాకాలంగా డిమాండ్లలో ఉన్నవే. అప్పట్లో డిమాండ్లను పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూల్ ముంచుకుని వస్తున్న సమయంలో ట్రైబల్ యూనివర్సిటి అని, పసుపుబోర్డని ఏవేవో హామీలిచ్చేస్తే జనాలు నమ్మేసి బీజేపీకి ఓట్లసేస్తారని మోడీ అనుకుంటున్నట్లున్నారు. అందుకనే సడెన్ గా ఈ వరాలను ప్రకటించారు. ఇది మినహాయిస్తే బహరింగ సభలో మోడీ స్పీచ్ పెద్దగా జనాలను ఆకట్టుకోలేదనే చెప్పాలి. మరి ఎన్నికల్లో జనాలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.