గడ్డకట్టిన చెరువులో పడిన గుర్రాన్ని పోలీసులు ఇలా రక్షించారు
గడ్డకట్టిన చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన ఓ గుర్రాన్ని పోలీసులు, సహాయక సిబ్బంది తాళ్ల సహాయంతో రక్షించారు.
గడ్డకట్టిన చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన ఓ గుర్రాన్ని పోలీసులు, సహాయక సిబ్బంది తాళ్ల సహాయంతో రక్షించారు. మొత్తం గడ్డకట్టిన చెరువు మధ్యలో కాసింత నీటిలో గంటల తరబడి ఉండటంతో గుర్రం తీవ్రంగా గడ్డకట్టిపోయింది. అయితే బయటకు తీసిన కొద్ది సేపటికే అది లేచి నిలబడింది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సహాయక చర్యలు చేపట్టి గుర్రాన్ని సురక్షితంగా బయటకు తీశారు. కానీ, నీటిలో ఎక్కువ సమయం గడిపిన కారణంగా దాని శరీర ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. వెంటనే సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం గుర్రం పూర్తిగా కోలుకుంది.
గుర్రాల యజమాని వివరాల ప్రకారం.. మూడు గుర్రాలు ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా, వాటిలో ఒకటి ప్రమాదవశాత్తు గడ్డకట్టిన చెరువు మధ్య నీటిలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. గుర్రాన్ని కాపాడిన అనంతరం, మరికొన్ని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
స్థానిక ప్రజలు, పశువుల యజమానులు తమ జంతువులను అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లనివ్వకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.