వ‌ర‌వ‌రరావు అల్లుడి ఇంట్లో సోదాలు.. నార్మ‌ల్ కాదు.. చాలా సీరియ‌స్‌!

ఇదే కేసులో ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ ను కూక‌ట్ ప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-02-08 09:24 GMT

విప్ల‌వ ర‌చ‌యిత‌, ప్ర‌ముఖ క‌మ్యూనిస్టు నాయ‌కుడు వ‌ర‌వ‌ర‌రావు అల్లుడు, ప్రముఖ జ‌ర్న‌లిస్టు(విప్లవ), వీక్ష‌ణం మాస‌ప‌త్రిక ఎడిట‌ర్‌ వేణు గోపాల్ ఇంట్లో జాతీయ ద‌ర్యాప్తు విభాగం(ఎన్ ఐఏ) అధికారులు సోదాలు చేశారు. ఇది సాధార‌ణ సోదాలు కావని, చాలా సీరియ‌స్ వ్య‌వ‌హార‌మ‌ని తెలిసింది. ``కబ‌ళి(మ‌రాఠాలో విప్ల‌వం) ద‌ళం`` ఏర్పాటు చేసి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును కూలదోసేందుకు జ‌రిగిన కుట్ర‌లో వేణు గోపాల్ కూడా ఒక‌ర‌ని ఎన్ ఐఎ త‌న కేసులో న‌మోదు చేసింది. దీంతో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్ప‌డింది. అయితే.. ఈ కేసును వేణు తోసిపుచ్చుతున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌పై కేసులు పెట్టార‌ని అన్నారు.

ఏం జ‌రిగింది?

గ‌తంలో మ‌హారాష్ట్ర శివారులో విప్లవ ర‌చ‌యిత‌లు భేటీ అయి.. ప్ర‌ధానిని అంతం చేయాల‌ని కుట్ర ప‌న్నిన‌ట్టు ఎన్ ఐఏ పేర్కొంటూ.. అప్ప‌టి కేసులో వ‌ర‌వ‌ర‌రావు స‌హా అనేక మందిని అరెస్టు చేసింది. ప్ర‌స్తుతం వీరంతా జైల్లోనే ఉన్నారు. ఇటీవ‌ల వ‌ర‌వ‌ర‌రావు.. కొంత బెయిల్ ల‌భించింది. ఇప్పుడు దీని త‌ద‌నంత‌రం.. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు కంబ‌ళి ద‌ళం పేరుతో మీటింగ్ పెట్టార‌నేది, దీనిలో వేణు పాత్ర కూడా ఉంద‌నేది ఎన్ ఐఏ చేస్తున్న ఆరోప‌ణ‌.

ఇదే కేసులో ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ ను కూక‌ట్ ప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ ఐఏ.. విచారించి.. మ‌రింత స‌మాచారం రాబ‌ట్టింది. దీని ప్ర‌కార‌మే.. వేణు నివాసంలో సోదాలు చేసినట్లు స‌మాచారం. కాగా, వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ గురువారం.. తెల్లవారుజామున ఐదు గంటలకే ఎన్ ఐఏ అధికారులు త‌మ నివాసానికి వ‌చ్చార‌ని, సెర్చ్ వారెంట్ తెచ్చార‌ని తెలిపారు.

``నా మొబైల్ సీజ్ చేశారు. న‌యీమ్‌పై రాసిన లేఖ‌ల‌ను తీసుకువెళ్లారు. మావోయిస్టు దీపక్‌తో నాకు సంబంధం ఉందని కేసు నమోదు చేశారు. కానీ, అలాంటిదేమీ లేదు. కంబ‌ళి కేసులో న‌న్ను ఏ -22 గా చేర్చారు. ఇది పూర్తిగా అబద్దపు కేసు. నేను మాస పత్రికకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాను. ప్రభుత్వాన్ని కులగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయ‌లేదు`` అని వేణు వివ‌రించారు.

Tags:    

Similar News