తొలుత కరోనా వార్నింగ్ ఇచ్చినోడు 2025 ఎలా ఉంటుందో చెప్పాడు
ఇదంతా ఒక ఎత్తు అయితే.. 38 ఏళ్ల ఒక వ్యక్తి చెబుతున్న విషయాల్ని కాస్తంత ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయి.
2024 వెళ్లిపోయింది. 2025 వచ్చేసింది. ఎప్పటిలానే పాత సంవత్సరానికి టాటా చెప్పేసి.. కొత్త ఏడాదికి వెల్ కం చెప్పే హడావుడి ప్రపంచ వ్యాప్తంగా సాగింది. ఉత్సాహ వాతావరణంలో సాగిన కొత్త సంవత్సర వేడుకుల వేళ.. కొన్ని చోట్ల అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్త ఏడాది ఏం జరుగుతుంది? అన్న ఆసక్తి పలువురిలో ఉంటుంది.
ఇలాంటి వేళ.. ఒక వైరల్ న్యూస్ ఇప్పుడు హడావుడి చేస్తోంది. కొత్త సంవత్సరం కొత్తల్లోనూ కొంత కంగారును తెచ్చేలా ఉన్న ఈ న్యూస్ ను ఇప్పటికే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వెబ్ సైట్లలోనూ.. సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని మాత్రమే మేం అందిస్తున్నాం. అంతే తప్పించి.. దీన్ని ధ్రువీకరించటం కానీ.. ఇది పక్కా అని మాత్రం చెప్పట్లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీన్ని కేవలం సమాచారంగా మాత్రమే చూస్తే సరిపోతుంది. ఇంతకూ అసలు విషయం ఏమంటే..
2025లో ప్రపంచ వ్యాప్తంగా భారీ విపత్తులు చోటు చేసుకోవటం ఖాయమన్న అంచనాల్ని కొందరు జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 38 ఏళ్ల ఒక వ్యక్తి చెబుతున్న విషయాల్ని కాస్తంత ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయి. ఆ వ్యక్తి మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే.. కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం తల్లడిల్లుతుందన్న అంచాన వేసిన తొలి వ్యక్తి అతనే కాబట్టి. 2018లోనే కరోనాలాంటి మహమ్మారి వస్తుందని.. దాని కారణంగా లక్షల మంది చనిపోతారని ఆ వ్యక్తి చెప్పారు. అదే వ్యక్తి 2025 ఎలా ఉంటుందో చెప్పాడు.
ప్రముఖ మీడియా సంస్థ మిర్రర్ పబ్లిష్ చేసిన స్టోరీ ప్రకారమంటూ.. జాతీయ మీడియా సంస్థ ఒకటి ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. లండన్ కు చెందిన హిప్నో థెరపిస్టు నికోలస్ ఔజులా కొత్త ఏడాది ప్రపంచానికి విషమ పరీక్షలు ఎదురవుతాయని పేర్కొన్నారు. 2025లో మూడో ప్రపంచ యుద్దం జరగటం ఖాయమన్నాడు. 2025 దయలేని సంవత్సరంగా మారుతుందన్న అంచనాను వినిపించాడు.
ఇంతకూ ఈ నికోలస్ గురించి చెప్పాల్సి వస్తే.. అతగాడి పదిహేడేళ్ల వయసులో అతడి కలలో ఎవరో కనిపించి భవిష్యత్తు గురించి చెప్పాడని చెబుతాడు. ఇప్పటివరకు ఇతడు చెప్పిన అంచనాలు నిజం కావటంతో.. తాజాగా అతడి నోటి నుంచి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. ట్రంప్ విజయాన్ని.. ఏఐ విస్తరణ.. రోబో ఆర్మీ లాంటి అంచనాలని అతను అందరి కంటే ముందే చెప్పాడని చెబుతారు.
జాతీయవాదం పేరుతో హత్యలు జరుగుతాయని.. రాజకీయ హత్యలు పెరుగుతాయని.. పాపం.. హింస..ఈ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయన్నారు. సముద్ర మట్టాలు పెరుగుతాయని.. అధిక వర్షపాతం.. వినాశకరమైన వరదలు విరుచుకుపడతాయని వెల్లడించారు. వీటి కారణంగా లక్షలాది మంది ప్రభావితం కాగా.. కోట్లాది మంది నిరాశ్రయులు అవుతారంటూ భయపెట్టేశాడు. పలు నగరాలు కూడా మునుగుతాయని అంచనా వేశాడు.
అదే సమయంలో బ్రిటన్ యువరాజు విలియం.. హ్యారీల మధ్య విభేదాలు సమిసిపోయి.. వీరిద్దరూ కలిసిపోతారని చెప్పారు. ఇక.. తన పూర్వ జన్మల గురించి ఆసక్తికరఅంశాల్ని వెల్లడించారు, తాను ఈజిప్టు రాణిగా గత జన్మలో ఉన్నట్లు చెప్పిన అతను.. చైనాలో టైలర్ గా.. హిమాలయాల్లో సన్యాసిగా కూడా జీవించినట్లు చెప్పారు. తాను ఆఫ్రియాలో పుట్టినప్పుడు తానో మంత్రగత్తెగా పేర్కొన్నారు. ఒక జన్మలో సింహంగా కూడా బతికినట్లు చెప్పిన అతను.. మనిసి మరణం అంతం కాదని.. ఆత్మ ఎప్పటికీ చనిపోదన్నారు. ఇతడి తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.