రాజకీయాల్లో వీరు తక్కువ, వారు ఎక్కువ... గడ్కరీ హాట్ కామెంట్స్‌!

ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన గడ్కరీ, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపారు.

Update: 2024-02-07 12:30 GMT

చాలా మంది చెప్పే మాట... ఆ రోజుల్లో రాజకీయ నాయకులకు, నేటి రాజకీయ నాయకులకూ అసలు పొంతనే లేదని! అప్పట్లో రాజకీయ నాయకులు అనేవారు.. ప్రజాసేవకులni, ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు కేవలం బిజినెస్ మ్యాన్స్ అని అంటుంటారు. ఇదే సమయంలొ సిద్ధాంతాలకు తావేలేదు, అవకాశవాదులకే అవకాశాలెక్కువ అనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. ఈ సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని.. ఇదే సమయంలో అవకాశవాదులే నేటి రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. దీంతో, ఆయన కామెంట్స్‌ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారాయి.

ఇదే సమయంలో... నేటి రాజకీయాల్లో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా.. అధికార పార్టీతో అంటకాగాలని చూసేవారే అధికమని చెప్పిన గడ్కరీ... ఇలాంటి అవకాశవాదులే ఎక్కువ మంది ఉన్నారని అభిప్రాయపడ్డారు! ఈ క్రమంలోనే రాజకీయ నాయకుడికి సిద్ధాంతం అనేది లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ఇదే క్రమంలో... పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా రాజకీయాల్లో మంచిగా పనిచేసేవాడికి, చెడ్డపనులు చేసేవాడికి వచ్చే ఫలితాలను కూడా సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా... ఏ పార్టీలో అయినా, మరే ప్రభుత్వంలో అయినా మంచి పనిచేసేవాడికి గౌరవం లభించదని, చెడ్డ పనిచేసే వారికి శిక్ష పడదని తానెప్పుడూ సరదాగా చెప్పేవాడిననిఅన్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లో పబ్లిసిటీ, పాపులారటీ ఎంత అవసరం అనే విషయాలపై స్పందించిన ఆయన... రాజకీయాల్లో పబ్లిసిటీ, పాపులారిటీ చాలా అవసరం. అయితే.. పార్లమెంట్‌ లో ఏం మాట్లాడతారో దానికంటే తమ నియోజకవర్గాల్లో ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారనేది ఇంకా ముఖ్యం అని తెలిపారు.

ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన గడ్కరీ, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా... అటల్ బిహారీ వాజ్‌ పేయి తర్వాత తనను ఎంతగానో ఆకట్టుకున్న వ్యక్తి జార్జ్ ఫెర్నాండెజ్ అని.. ఆయన ప్రవర్తన, సరళత, వ్యక్తిత్వం గురించి తానెంతో నేర్చుకున్నట్లు వెల్లడించారు.





 


Tags:    

Similar News