కాంగ్రెస్ కోసం నితిన్ రావాలంటే... పెద్దలు ఆ పని చేయాల్సిందే?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాల సందడి ఎప్పుడో మొదలైపోయింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాల సందడి ఎప్పుడో మొదలైపోయింది. ఇక ప్రధాన పార్టీలన్నీ టిక్కెట్ల సందడి కొలిక్కి తెచ్చేస్తుండటంతో ఇక ప్రచార కార్యక్రమాలు ఏస్థాయిలో ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో గత కొన్ని రోజులుగా హీరో నితిన్ పేరు తెలంగాణ రాజకీయాల్లో నానుతున్న సంగతి తెలిసిందే.
అన్నీ అనుకూలంగా జరిగితే హీరో నితిన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, అందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని కథనాలొచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తర్వాత కన్ ఫాం అయ్యింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. నితిన్ ప్రచారం మాత్రం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
అవును... నితిన్ మేనమామ నగేష్ రెడ్డికి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆయన కోసం కాంగ్రెస్ పార్టీకి నితిన్ ప్రచారం చేస్తారని అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి జిల్లా మొత్తం ప్రచారం చేస్తారా.. లేక, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మాత్రమే చేస్తారా అనే సంగతి తెలియదు కానీ... ప్రచారా మాత్రం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
హీరో నితిన్ మేనమామ నగేష్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఆయన పదేళ్లకు పైగా పని చేశారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు.
ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలను నగేష్ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ భేటీలో తన మేనల్లుడు నితిన్ తో ప్రచారం విషయంపై కూడా డిస్కషన్స్ వచ్చాయని అంటున్నారు. దీంతో నిజామాబాద్ రూరల్ టికెట్ ను నగేష్ రెడ్డికి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం!
కాగా... 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భూపతి రెడ్డి.. సమీప బీఆరెస్స్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2014లో కూడా ఇక్కడ్ద నుంచి బాజిరెడ్డే గెలిచారు. దీంతో ఈసారి బలమైన నేతను దింపాలని కాంగ్రెస్ పెద్దలు బలంగా భావిస్తున్నారని అంటున్నారు.