"జంగిల్ రక్షా బంధన్"... చెట్టుకు రాఖీ కట్టిన చీఫ్ మినిస్టర్!

అవును... రాఖీ పౌర్ణమి వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు.. శుభాకాంక్షలు తెలిపారు! దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

Update: 2024-08-19 14:30 GMT

నేడు రాఖీ పౌర్ణమి కావడంతో ఎక్కడ చూసినా అన్నా చెల్లళ్ల అనుబంధానికి ప్రతీకగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చెట్టుకు రాఖీ కట్టారు. ఎందుకండీ అంటే... పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తన లక్ష్యమని, అందుకే ఈ ప్రత్యేక నిర్ణయం అని తెలిపారు.

 

అవును... రాఖీ పౌర్ణమి వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు.. శుభాకాంక్షలు తెలిపారు! దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎంలు, మంత్రులతో కలిసి రాజధాని వాటికలో మొక్కలు నాటారు.

వాస్తవానికి 2012 నుంచి బీహార్ లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రక్షా బంధన్ ను "బీహార్ వృక్ష సురక్షా దివస్" గా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం... మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడి ప్రయావరణాన్ని రక్షిస్తామని పేర్కొంది.

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఓ సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగా సోదరభావాన్ని ప్రతిబింబించే రాఖీ పండగ రోజున అన్నదమ్ములకు, ఇతర కుటుంబ సభ్యులకే కాదు.. పచ్చని ప్రకృతికీ రక్ష కట్టాలనేది ఆ సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ పచ్చని తల్లిని సురక్షితంగా ఉంచుకోవడం మన కనీస ధర్మం అని ఆ ప్రజలు నమ్ముతారు.

ఈ ఆలోచనతోనే అక్కడి ప్రజలు రాఖీ పౌర్ణమి రోజున దగ్గరలోని అడ్దవి వద్దకు చేరుకుని.. చెట్లు, మహా వృక్షాల కొమ్మలు, కాండాలకు రాఖీలు కడుతుంటారు. దీన్నే వారు "జంగిల్ రక్షా బంధన్" గా పిలుస్తారు. ఈ ఆచారం అక్కడ 2004 నుంచే ప్రారంభమైంది. ఈ నేపథ్యమో బీహార్ సీఎం.. చెట్టుకు రాఖీ కట్టి, ప్రకృతిపై ప్రజల భాధ్యతను మరోసారి గుర్తు చేశారు.

Tags:    

Similar News