ఏపీలో పెన్షన్లు...బజ్ లేదా ?
మరి అలా ఏపీలో పెన్షన్ల పండుగ జూలై ఫస్ట్ నే సాగింది. అయితే పెన్షన్ల పండుగకు బజ్ లేదా అన్న చర్చ సాగుతోంది. జనాల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లేదా అన్న మాట కూడా వినిపిస్తోంది.
ఏపీలో పెన్షన్ పండుగ టీడీపీ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కీలక మంత్రులు నేతలు ఎమ్మెల్యేలు అంతా పెన్షన్ పండుగలో పాలు పంచుకున్నారు. లబ్దిదారుల విషయానికి వస్తే ఇది నిజంగా పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఏడు వేల రూపాయలు ఒకేసారి అందుకోవడం దేశ చరిత్రలోనే జరగలేదు. అది ఒక రికార్డు.
మరి అలా ఏపీలో పెన్షన్ల పండుగ జూలై ఫస్ట్ నే సాగింది. అయితే పెన్షన్ల పండుగకు బజ్ లేదా అన్న చర్చ సాగుతోంది. జనాల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లేదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలా ఎందుకు అంటే జనాలకు ఎపుడూ కొత్తదనం కావాలి.
కొత్త రకం గుండి పిన్నీస్ చేస్తే రేటు ఎక్కువైనా కొంటారు. అదే రేటు తక్కువ అయినా పాతవి కొనరు. అయితే సామాజిక పెన్షన్ల విషయం తీసుకుంటే పాతవే కదా అన్న చర్చ సాగుతోంది. పెన్షన్లు ప్రతీ నెలా అందుకుంటున్నారు కాకపోతే ఈసారి పెన్షన్ మొత్తం పెంచారు. దాంతో పాటు మూడు నెలల బకాయిలు చెల్లిస్తున్నారు. దాంతో జనాలకు పెన్షన్ అందుకున్నామన్న భావన మాత్రమే ఉంది.
ఎంత డబ్బులు అని కాదు పెన్షన్ ఇచ్చారు అన్న ఫీల్ తో ఉన్నారు అని అంటున్నారు. అందుకే పెన్షన్లకు భారీగా మొత్తాలను పెంచి ఇచ్చినా స్వయంగా సీఎం చంద్రబాబు ఇంటికే వెళ్ళి పెన్షన్ పంచినా అనుకున్న స్థాయిలో బజ్ అయితే లేదు అని అంటున్నారు.
అయితే టీడీపీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా బలంగా ఉంది. దాంతో కొద్ది రోజుల నుంచే పెన్షన్లు భారీగా పెంపు అంటూ బ్యానర్లు కట్టి మరీ పాజిటివ్ గా రాస్తున్నారు. అదే టైం లో సోషల్ మీడియాలో టీడీపీ జోరు మామూలుగా లేదు. అక్కడ కూడా పెన్షన్ల మీద పూర్తి స్థాయిలో పోస్టింగులు పెడుతూ పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ నేతల హడావుడి వేరే లెవెల్ లో ఉంది. పెన్షన్లను పెంచిది భారీగా ఇస్తోంది చంద్రబాబే అని వారు బాగానే ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరెంత ప్రచారం చేసినా కూడా అనుకున్న స్థాయిలో అయితే జనాల్లో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు అని అంటున్నారు.
ఇలా ఎందుకు అంటే ఇది బీసీ కాలం నాటి పాత పధకం కావడమే అంటున్నారు. అదే మరో కొత్తపధకం కనుక అమలు చేసి ఉంటే దాని రియాక్షన్ వేరేగా వచ్చేదని అంటున్నారు. పెన్షన్లు పెంచి ఇవ్వడాన్ని హర్షిస్తున్నారు. అంతే తప్ప ఆహా ఓహోలు అయితే అసలు లేవు అని అంటున్నారు. ఏది ఏమైనా సామాజిక పెన్షన్ల విషయంలో టీడీపీ ఆశించిన పాజిటివ్ బజ్ అయితే అనుకున్న రేంజిలో రాలేదు అని అంటున్నారు.