చీకట్లు తొలగక ముందే.. తారక్..కల్యాణ్ రామ్ నివాళి

అందులో తారక్.. కల్యాణ్ రామ్ లు ఉన్నారు. వారిద్దరు వచ్చేసరికి ఎన్టీఆర్ ఘాట్ పూలతో కళకళలాడాల్సిన దానికి భిన్నంగా ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోవటంతో.. తారక్ అసహనం వ్యక్తం చేశారు.

Update: 2025-01-18 05:09 GMT

ప్రాంతాలు వేరైనా తెలుగోళ్లందరికి అరాధ్యదైవంగా నిలిచే నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా ఈ ఉదయం (శనివారం) తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్.. ఆయన సోదరుడు కల్యాణ్ రామ్. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెల్లవారుజామునే తారక్ వస్తూ ఉంటారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ సంప్రదాయాన్ని తారక్ ఈసారీ పాటించారు.

సోదరుడు కల్యాణ్ రామ్ తో కలిసి వచ్చిన తారక్.. తాత ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. కాసేపు అక్కడే మైనంగా కూర్చుండిపోయారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకొని పలువురు రాజకీయ నేతలు.. అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు.

అందులో తారక్.. కల్యాణ్ రామ్ లు ఉన్నారు. వారిద్దరు వచ్చేసరికి ఎన్టీఆర్ ఘాట్ పూలతో కళకళలాడాల్సిన దానికి భిన్నంగా ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోవటంతో.. తారక్ అసహనం వ్యక్తం చేశారు.

వెంటనే పూలు తెప్పించి.. డెకరేట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తారక్.. ఇకపై తాత వర్థంతి.. జయంతి వేడుకల ఏర్పాట్లు తానే స్వయంగా చూసుకుంటానని చెప్పటమే కాదు.. అప్పటినుంచి ఆయనే చూసుకుంటున్నట్లు చెబుతారు. గత ఏడాది తారక్ దగ్గర ఉండి తాత సమాధిని పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా అక్కడ భారీ ఎత్తున తారక్ ఫ్లెక్సీలు ఉండటంపై బాలక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు.. వాటిని తొలగించాలని చెప్పటంతో కాస్తంత టెన్షన్ వాతావరణం నెలకొంది.

నిజానికి వర్థంతి.. జయంతి వేళలో.. ఎన్టీఆర్ ఘాటను వ్యక్తిగత ప్రచారాల కోసం వాడటం బాగోదు. ఒకవేళ.. అత్యుత్సాహంతో అభిమానులు అలాంటి పని చేసినా.. తారక్ అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే బాగుండేది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా..ఎప్పటిలానే ఎన్టీఆర్ జయంతి.. వర్థంతి రోజున తానే మొదట వచ్చి నివాళులు అర్పించే సంప్రదాయాన్ని తారక్ మరోసారి పాటించారని చెప్పాలి.

Tags:    

Similar News