మేటర్ సీరియస్... యూట్యూబ్ లో తల్లీ కుమారులపై అభ్యంతరకర వీడియోలు!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ గురించి తెలియనివారుండరన్నా అతిశయోక్తి కాదేమో! ఆ స్థాయిలో ఈ యూట్యూబ్ ప్రజాదరణ చూరగొంది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ గురించి తెలియనివారుండరన్నా అతిశయోక్తి కాదేమో! ఆ స్థాయిలో ఈ యూట్యూబ్ ప్రజాదరణ చూరగొంది. ప్రపంచంలోని ఏ విషయానికి సంబంధించిన వీడియో అయినా ఇక్కడ దొరుకుతుందని అంటారు! అయితే ఇందులో అశ్లీల కంటెంట్ పై మొదటినుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్.సి.పి.సి.ఆర్.) సీరియస్ అయ్యింది.
అవును... ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీచేసింది. యూట్యూబ్ లో కొన్ని ఛానళ్లు.. తల్లీ కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారంటూ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైనే యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 15న ఆయా ఛానళ్ల జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
ఈ మేరకు ఎన్.సి.పి.సి.ఆర్. చీఫ్ ప్రియాంక్ కనూంగో భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగా... తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్ లలో ఆందోళనకరమైన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు చిన్నారుల భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో... అసలు ఎటువంటి అసభ్యకర కంటెంట్ ను అయినా తమ మీడియం నుంచి తొలగించేందుకు ఎటువంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని యూట్యూబ్ ను ఆదేశించింది. ఈ సందర్భంగా జారీ చేసిన సమన్లకు జనవరి 15న హాజరుకాకుండా స్పందించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఈ క్రమంలో ఈ వ్యవహారంపై స్పందించిన కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో... తల్లులు, కుమారుల మధ్య అసభ్యకర సన్నివేశాలతో కొన్ని ఛానళ్లు వీడియోలను విడుదల చేస్తున్నాయని అన్నారు. ఇవి పోక్సో చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో... ఇలాంటి వీడియోలతో వ్యాపారం చేయడం అంటే అశ్లీల దృశ్యాలను అమ్మడం లాంటిదే అని అన్నారు.
ఇటువంటి ఛానళ్లు, వీడియోలపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని జైలుకు పంపించాలని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.