రూపాయి కట్నంతో కుమారుడి పెళ్లి... తెరపైకి కొత్త ప్రశ్న!
వివరాళ్లోకి వెళ్తే... ఒక్క రూపాయి మాత్రమే కట్నంగా తీసుకుని కుమారుడికి వివాహం జరిపించారు హరియాణా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్.
వరకట్నం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనంత జాడ్యం మరొకటి లేదని కొందరంటే... బలవంతం లేని కట్నం సమర్ధనీయమే అని మరికొంతమంది అంటుంటారు! కంగారు పడకండి... ఎదురు కట్నం ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లిచేసుకునే రోజులు ముందు ముందు రాబోతున్నాయని మరొకరు అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఒక రూపాయి కట్నం తీసుకుని ఒక సబ్ ఇన్ స్పెక్టర్ వివాహం జరిగింది. అతని తండ్రి పొలిటీషియన్ కావడం గమనార్హం.
అవును... సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న తన కుమారుడికి వివాహం చేయాలని రాజకీయ నాయకుడైన అతని తండ్రి భావించారు. దీంతో ఒక సంబంధం సెట్ చేశారు! ఈ సందర్భంగా ఆడపిల్ల తండ్రి అందరి ముందూ వరుడికి భారీగా కట్నం ఇవ్వాలని భావించడంతో.. అందుకు వరుడి తండ్రి నిరాకరించారు. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ... ఆ సంచిలో నుంచి ఒక రూపాయి మాత్రం కట్నంగా తీసుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఒక్క రూపాయి మాత్రమే కట్నంగా తీసుకుని కుమారుడికి వివాహం జరిపించారు హరియాణా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్. సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆయన కుమారుడు గౌరవ్ కు.. హరియాణా రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఛైర్మన్ భూపాల్ సింగ్ కాదరీ కుమార్తె గరిమాతో వివాహం చేయాలని నిర్ణయించారు. ఆ వేడుకలో భూపాల్ సింగ్ బంధువులు అందరి ముందు వరుడికి కట్నం ఇచ్చారు. అయితే, ఆ కట్నాన్ని వరుడి తండ్రి కృష్ణ చౌకర్ తిరస్కరించారు.
అనంతరం ఆ డబ్బు సంచిలో నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశారు. దీంతో అతిథులంతా వరుడి తండ్రిపై ప్రశంసలు కురిపించారు. ఇది ఆదర్శవంతమైన చర్య అని అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఆ ఒక్కరూపాయి మాత్రం ఎందుకు అనే చర్చను తెరపైకి తెస్తుండటం గమనార్హం. మొత్తానికి తీసుకోకుండా ఉంటే మరింత ఆదర్శంగా ఉండేదని... అసలు వరకట్నం అనే టాపిక్కే ఉండేది కాదని.. రూపాయి అయినా తీసుకోవడం వల్ల వరకట్నం ఉందనే విషయాన్ని గుర్తుచేసినట్లవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా... ఈ నేత చేసిన పని ఆ వివాహ వేడుకలో హైలెట్ గా నిలిచింది. ఇది చాలా ఆదర్శవంతమైన చర్చ అనే కామెంట్లను సొంతం చేసుకుంది.