పక్కకెళ్లి ఆడుకోమ్మా!... పాక్ ఎయిర్ లైన్స్ కి ఎంత కష్టం?
ఈ విమానంలో ఒకసారి ప్రయాణించిన వారి అనుభవాలు షాకింగ్ గా ఉంటున్నాయి.
పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ) పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసింది. ఇక భద్రతాపరమైన ఆందోళనల సంగతి చెప్పే పనే లేదు! ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాల్లో ఇది ఒకటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విమానంలో ఒకసారి ప్రయాణించిన వారి అనుభవాలు షాకింగ్ గా ఉంటున్నాయి.
ఇందులో భాగంగా ఆ విమానాల్లోని సీట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. ఆ సీట్ల హ్యాండిల్స్ విరిపోయాయని.. ఓవర్ హెడ్ బిన్ కు టేప్ అంటించారని.. చెబుతున్నారు. ఈ క్రమంలోనే భద్రతాపరమైన కారణాలు చూపెడుతూ 2020లోనే ఈ పీఐఏ ను ఐరోపా యూనియన్ నిషేధించింది. ఈ సందర్భంగా... పీఐఏ లోని ప్రతీ ముగ్గురు పైలెట్లలో ఒకరికి నకిలీ లైసెన్స్ ఉందని తెలిపింది.
ఈ పరిస్థితుల్లో దీన్ని రన్ చేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని భావించిందో ఏమో కానీ... అందులోని మెజార్టీ వాటాను విక్రయించేందుకు అక్టోబర్ 31న ముహూర్తం ఫిక్స్ చేసింది పాక్ ప్రభుత్వం. ఈ క్రమంలో... పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలో 60శాతం వాటాను కొనుగోలు చేసే అర్హత ఉన్న ఆరు సంస్థలను ఫ్రీ క్వాలిఫై చేసింది. అయితే... వాటిలో ఐదు సంస్థలు ఈ ప్రక్రియ నుంచి ఉపసంహరించుకున్నాయి.
ఇదే సమయంలో... కాలం చెల్లిన విమానాలు, పుష్కలంగా ఉన్న ఆర్థిక కష్టాలు, నిర్వహణపరమైన ఇబ్బందులు వెరసి ప్రస్తుతం పీఐఏ ఉన్న పరిస్థితుల్లో వాటాలు కొనడం సాధ్యం కాదని.. పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కావాలని సదరు సంస్థలు ప్రతిపాదనను తీసుకొచ్చాయి. అందుకు పాక్ ప్రభుత్వం ససేమిరా అన్నదని అంటున్నారు. దీంతో.. ఆ ఐదు సంస్థలూ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నయి!
దీంతో... తమ పరిస్థితి గమనించిన పాకిస్థాన్ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన 60 శతం వాటాను కాస్తా 76 శాతానికి పెంచింది. దీంతో... ఒక సంస్థ మాత్రమే ప్రీ క్వాలిఫికేషన్ పత్రాలు సమర్పించింది.
కాగా.. ఒక ప్రాజెక్టు నిమిత్తం టెండర్ వేయడానికి అర్హత కలిగిఉన్నారో లేదో నిర్ణయించే ప్రక్రియను ప్రీ క్వాలిఫైడ్ బిడ్ అంటారు. ఇందులో బిడ్డర్ ఆర్థిక పరిస్థితులు, అనుభవం మొదలైన వాటిని పరిశీలిస్తారు.