ఇండియన్ నేవీకి థాంక్స్... పాకిస్థానీయుల వీడియో వైరల్!

అవును... సోమాలియా సముద్రపు దొంగల నుంచి తమను రక్షించినందుకు భారత నావికాదళానికి కృతజ్ఞతలు తెలిపారు పాకిస్థానీయులు.

Update: 2024-02-01 05:30 GMT

తమ్ముడు తనవాడైనా ధర్మం వైపు నిలబడటం.. ఆపదలో ఉన్నాడంటే శత్రువునైనా రక్షించడం భారతీయ లక్షణాల్లో ఒకటని అంటుంటారు! ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్థానీయుల విషయంలో ఇండియన్ నేవీ అటువంటి పనే చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని, మంచితనాన్ని, సాహసాన్ని గుర్తించినట్లున్నారు పాకిస్థాన్ ప్రజానికం!! ఇందులో భాగంగా భారత్ ఆర్మీకి థాంక్స్ చేబుతున్నారు.

అవును... సోమాలియా సముద్రపు దొంగల నుంచి తమను రక్షించినందుకు భారత నావికాదళానికి కృతజ్ఞతలు తెలిపారు పాకిస్థానీయులు. రెండు రోజుల క్రితం... సోమాలియా సముద్రపు దొంగల నుండి తమను రక్షించినందుకు భారత నావికాదళానికి ధన్యవాదాలు అంటూ చెబుతున్నారు పాక్ ప్రజలు. ఈ సందర్భంగా ఇండియన్ నేవీ విడుదల చేసిన యాంటీ పైరసీ ఆపరేషన్ వీడియో వైరల్ గా మారిందని తెలుస్తుంది.

ఈ సమయంలో... రక్షించబడిన పాకిస్తానీ - ఇరానియన్ సిబ్బందిలోని సభ్యుడు.. భారత నావికాదళాన్ని చూసిన తర్వాత సముద్రపు దొంగలు తమ ఆయుధాలను ఎలా పడవేశారో వివరించాడు. ఇదే సమయంలో... ఆపరేషన్ అనంతరం ఇండియన్ నేవీ సోషల్ మీడియా ప్లాట్‌ ఫారం ఎక్స్‌ లో షేర్ చేసిన వీడియోలో నిరాయుధ సముద్రపు దొంగలను చూపించింది. ఇదే వీడియోలో... రక్షించబడిన పాకిస్తానీ, ఇరాన్ సిబ్బందిలోని సభ్యుడు ఉన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన వారు... "మేము సోమాలియా సముద్రపు దొంగలచే పట్టబడ్డాము. అప్పుడు, భారత నావికాదళాన్ని చూసి సోమాలియా సముద్రపు దొంగలు భయపడ్డారు. మా ప్రాణాలను కాపాడినందుకు భారత నావికాదళానికి ధన్యవాదాలు" అని అన్నారు. ఈ సమయంలో... హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతకు భారత నౌకాదళం కట్టుబడి ఉందని ఇండియన్ నేవీ అధికారి ఒకరు పేర్కొన్నారు!

ఇదే క్రమంలో... "ఐ.ఎన్‌.ఎస్ సుమిత్ర, 36 గంటల కంటే తక్కువ వ్యవధిలో వేగవంతమైన ప్రయత్నాల ద్వారా దక్షిణ అరేబియాలో 36 సిబ్బంది (17 ఇరానియన్ - 19 పాకిస్తానీ)తో పాటు హైజాక్ చేయబడిన రెండు ఫిషింగ్ వెసెల్‌ లను రక్షించింది" అని నేవీ పేర్కొంది!!

కాగా... సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలచే పట్టుబడిన సుమారు 19మంది పాకిస్థాన్ జాలర్లను ఇండియన్ నేవీ రక్షించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ ఓడపై సోమాలియా పైరేట్స్ దాడిచేయగా... ఇండియన్ నేవీ వార్ షిప్ ఐ.ఎన్.ఎస్. సుమిత్ర రంగంలోకి దిగి వారిని కాపాడింది. ఈ సమయంలోనే పాకిస్థానీ జాలర్లు ఇండియన్ నేవీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.




Tags:    

Similar News