జగన్ ని విమర్శించిన పాస్టర్ మృతి.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై రాజమండ్రి బయలుదేరిన ఆయన.. అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని సీఐ తెలిపారు.;

Update: 2025-03-26 14:59 GMT
జగన్  ని విమర్శించిన పాస్టర్  మృతి.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిచెందినట్లు రాజానగరం సీఐ మంగళవారం తెలిపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై రాజమండ్రి బయలుదేరిన ఆయన.. అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని సీఐ తెలిపారు.

ఈ సందర్భంగా.. రోడ్డుపై నుంచి దిగువకు ప్రమాదవశాత్తు జారిపోయారని.. దీంతో బుల్లెట్ అతనిపై పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయని.. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరూ గమనించలేదని చెప్పారు. ఈ సమయంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అవును.. ప్రముఖ దైవసేవకుడు ప్రవీణ్ పగడాల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే... ఇది ప్రమాదం కాదని.. ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదని.. ఇది ప్రమాదం కాదని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన షర్టుపై షూ గుర్తు ఉందనే ప్రచారమూ జరుగుతుంది.

దీంతో... ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన రాజమండ్రిలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క ఈ వ్యవహారం స్వయంగా ముఖ్యమంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. డీజీపీతో మాట్లాడి, అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆదేశించారు.

ఇదే సమయంలో... ఈ ఘటనపై లోతైన విచారణ చేయిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ విచారణ చేస్తోందని.. ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తొందని తెలిపారు. దీన్ని కేవలం యాక్సిడెంట్ గా మాత్రమే పరిగణించడం లేదని హోంమంత్రి తెలిపారు.

దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ.. మృతదేహం వద్ద సెల్ ఫోన్ గుర్తించామని.. చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్జేవై కి వెళ్లినట్లుగా ఉందని.. పోలీసులు ఫోన్ చేయగా.. రామ్మోహన్, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని ఆ మృతదేహం ప్రవీణ్ ది గా గుర్తించారని తెలిపారు.

ఇదే సమయంలో ఘటనా స్థలిలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో కొన్ని ఆధారాలు సేకరించామని.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని నిర్ణయించామని.. టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం చేయించామని.. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించామని తెలిపారు.

గతంలో జగన్ ని విమర్శించిన ప్రవీణ్!:

స్థానికంగాను, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోనూ, యూట్యూబ్ లోనూ క్రైస్తవ మత ప్రచారం చేస్తుంటారు ప్రవీణ్ పగడాల! ఈ సమయంలో గతంలో... జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెరపైకి వచ్చింది. అలా అని మరో రాజకీయ పార్టీని పొగడ లేదు కానీ... జగన్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలతో మాత్రం విభేదించారు.

ఇందులో భాగంగా.. పాస్టర్లకు రూ.5,000 చొప్పున ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు! ప్రజల సొమ్మును ఇలా మతపరమైన కార్యక్రమాలకు ఎలా కేటాయిస్తారని నాడు ప్రవీణ్ ప్రశ్నించారు కూడా! ఇది ఓటు బ్యాంక్ రాజకీయమంటూ పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు చేశారనే విషయాలు తెరపైకి వచ్చాయి!

Tags:    

Similar News