పవన్ ఢిల్లీ టూర్ తరువాత సంచలన పరిణామాలు ?
ఈ క్రమంలో పవన్ అర్జెంట్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అంటే పెద్ద పనే అని అంటున్నారు. జమిలి ఎన్నికలకు కేంద్రం వడివడిగా సిద్ధం అవుతోంది.
ఏపీలోని టీడీపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్జంటుగా ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి చేస్తున్న అధికార పర్యటన ఇదే అని అంటున్నారు.
కూటమి ప్రభుత్వ పాలన ఏపీలో ఆరు నెలలకు చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం విశేషం. ఏపీలో ప్రస్తుతం కూటమిలో కొంత అలజడి రేగుతోంది. పవన్ రాష్ట్ర హోం మంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలతో కూటమిలో ఏదో జరుగుతోందని అంతా అనుకునే నేపధ్యం ఉంది.
ఈ క్రమంలో పవన్ అర్జెంట్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అంటే పెద్ద పనే అని అంటున్నారు. జమిలి ఎన్నికలకు కేంద్రం వడివడిగా సిద్ధం అవుతోంది. అదే టైంలో ఏపీలో సొంత పార్టీ బీజేపీ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ జనసేనకే కేంద్రం ఇస్తోంది.
ఇదంతా ముందస్తు వ్యూహాలు దూర దృష్టితో అనే అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలూ ఉన్నా టైం వస్తే బీజేపీ అండ్ జనసేన ఒక్కటి అవుతాయని కూడా ప్రచారం సాగుతోంది. ఇక 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఆ దిశగా జనసేన కూడా సమాయత్తం అవుతోంది అని అంటున్నారు.
దానికి సంబంధించిన సంకేతాలను కూడా పవన్ ఇచ్చేశారు. మరో వైపు చూస్తే కూటమిలో మూడు పార్టీలు పొత్తు పెట్టుకునే జమిలి ఎన్నికల్లో పోటీ చేస్తాయని అంటున్నారు. అపుడు బీజేపీ ప్లస్ జనసేన సగానికి సగం సీట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. దాంతో పాటుగా బీజేపీ జనసేన నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం వాటా కోరుతారు అని కూడా అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీతో సమానంగా అధికారంలో భాగం పంచుకోవాలని కూడా బీజేపీ జనసేన ప్లాన్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో గత కొద్ది రోజులుగా పవన్ జమిలి ఎన్నికలను దృష్టిలొ పెట్టుకునే కీలక వ్యాఖ్యలు పవర్ ఫుల్ కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
ఇక ఏపీలో మారుతున్న రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద కూడా చర్చ సాగే అవకాశం ఉంది. కేంద్రం కూడా ఏపీలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో పవన్ పాత్ర మరింత పెంచేలా ఏమైనా కేంద్రం వైపు నుంచి బీజేపీ పెద్దలు చూస్తారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం అంటున్నారు.
ఇక ఐ డోంట్ కేర్ పదవులు అన్నట్లుగా పవన్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి. అంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏమిటి, రానున్న ఎన్నికల కోసం ఆయన తనదైన శైలిలో అధికారం నుంచి తప్పుకుని జనం వైపు నుంచి విపక్షంగా పోరాటం చేస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.
ఏది ఏమైనా బీజేపీలో అపర చాణక్యుడుగా పేరు గడించిన అమిత్ షా పిలుపు మేరకు పవన్ వెళ్లారా లేక పవన్ కోరి అపాయింట్మెంట్ తీసుకుని కేంద్ర పెద్దను కలిశారా అన్నది పక్కన పెడితే పవన్ ఢిల్లీ యాత్ర తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతాయాని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.
అవి కూటమి లోపలా లేక బయటా అన్నది తెలియకపోయినా జమిలి ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం గేర్ మార్చే దిశగా జనసేన మరింత హుషార్ చేస్తుంది అని అంటున్నారు. పవన్ ఇప్పటికే తనదైన వ్యాఖ్యలతో మంట పుట్టించారు. ఇక ఢిల్లీ టూర్ తరువాత ఆయన చేసే వ్యాఖ్యలు ఆయన తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆసక్తి పెరుగుతోంది. చూడాలి మరి పవన్ ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమిటి అన్నది. అలాగే ఆయన టూర్ విషయంలో ఒక్కసారిగా పెరిగిన ఉత్కంఠకు తగిన జవాబు ఏమై ఉంటుంది అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది అని అంటున్నారు.