సడెన్‌గా మారిన పవన్ షెడ్యూల్... బన్నీ ఇంటికి ఎందుకు వెళ్లలేదు..?
జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ను పరామర్శిస్తారని అందరూ అనుకున్నారు.
జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ను పరామర్శిస్తారని అందరూ అనుకున్నారు. శనివారం రాత్రి నుంచి మెయిన్ మీడియాలోనూ ఇదే చర్చ నడిచింది. శనివారం రాత్రే పవన్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఆదివారం ఎప్పుడు ? ఏ టైంలో పవన్ బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు అన్న చర్చే నడిచింది. కట్ చేస్తే ఆదివారం ఈ పరామర్శ జరగలేదు. పైగా ఉదయమే బన్నీ తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి అక్కడే లంచ్ చేసి.. చాలా సేపు చిరు కుటుంబంతో గడిపి వచ్చారు.
ఇక ఆదివారం ఉదయమే పవన్ తిరిగి విజయవాడకు వెళ్లిపోయారు. అక్కడ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సడెన్‌గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ షెడ్యూల్ మారడంతో అర్జున్‌ను పరామర్శించే ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లు సమాచారం. వీకెండ్‌లో పవన్ ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి కేటాయించేందుకే ఎక్కువుగా ఇష్టపడుతూ ఉంటారు. అత్యవసర పనులు ఉంటేనే ఆ టైంలో విజయవాడలో ఉంటారు.
ఈ క్రమంలోనే పవన్ హైదరాబాద్‌కు రావడం.. ఆదివారం ఉదయం అల్లు అర్జున్‌ను కలుస్తారన్న వార్తలతో మీడియా అటెన్షన్ అంతా బన్నీ ఇంటి మీదే ఫోకస్ అయ్యింది. ఎప్పుడు అయితే పవన్ విజయవాడకు ఆదివారం ఉదయమే వెళ్లిపోయారో... బన్నీ.. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి చిరు ఇంట్లో వాలిపోయారు. దీంతో అటెన్షన్ అంతా చిరు ఇంటి మీదకు వెళ్లింది.
ఇక బన్నీని అరెస్టు చేసినప్పుడు విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చిరంజీవి నేరుగా బన్నీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు అందరికి ధైర్యం చెప్పారు. ఇటీవలి కాలంలో అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ కలయికలు కాస్త హాట్ టాపిక్‌గా మారాయి.